Anushka Shetty Health Mystery.. ‘ఘాటీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పోయింది. అంతకు ముందూ అనుష్క నుంచి కొన్ని సినిమాలు ఇలానే వచ్చి పోయాయి.!
ఎక్కడా ‘ఘాటీ’ ప్రమోషన్లలో అనుష్క కనిపించలేదు. ముందే అనుష్క, తాను ప్రచారానికి రాలేనని చెప్పిందంటూ దర్శకుడు క్రిష్ చెప్పాడనుకోండి.. అది వేరే సంగతి.
పలువురు సెలబ్రిటీలతో అనుష్క పోన్ కాల్స్ మాత్రమే, ‘ఘాటీ’ ప్రమోషన్ల కోసం వాడుకోవాల్సి వచ్చింది. అదే, అనుష్క మీడియా ముందుకు వచ్చి వుంటేనో.!
Anushka Shetty Health Mystery.. ఎందుకు కనిపించడంలేదు.?
సెలబ్రిటీల మీద రకరకాల గాసిప్స్ ప్రచారం చేయడం.. వాటికి, సెలబ్రిటీలు కౌంటర్ ఎటాక్స్ ఇవ్వడం సర్వసాధారణమే. తాజాగా, అనుష్క విషయంలోనూ బోల్డన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ప్రధానంగా, అనుష్క ‘సైజ్ జీరో’ సినిమా తర్వాత, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోందనీ, అందుకే.. మీడియా ముందుకు రాలేకపోతోందనీ.. గాసిప్స్ అప్పటినుంచీ వినిపిస్తూనే వున్నాయి.
ఇప్పుడూ అదే తంతు.! ఆ అనారోగ్య సమస్య వల్లనే అనుష్క, మీడియాకి మొహం చూపించడం లేదంటూ బాధ్యతారాహిత్యమైన గాసిప్స్ ప్రచారంలోకి వస్తుండడం గమనార్హం.
తెరపై కనిపించినాసరే..
‘ఘాటీ’ సినిమాలో డూపుతో మేనేజ్ చేసేశారనీ, ‘ఏఐ’ సాయం తీసుకున్నారనీ.. అనుష్క సీన్స్ మీద కుప్పలు తెప్పలుగా గాసిప్స్ పుట్టుకొచ్చేశాయి.
అయినా, అనుష్క తన మీద వస్తున్న గాసిప్స్‌పై ఇప్పటిదాకా స్పందించకపోవడం గమనార్హం. ఇంతకీ, అనుష్కకి ఏమయ్యింది.? మళ్లీ ఇదే ప్రశ్న.!
Also Read: ‘కరుంగళి మాల’ ప్రాముఖ్యత ఏంటి? ఎవరు, ఎందుకు ధరించాలి.?
అనుష్క సన్నిహితుల నుంచి మాత్రం, ‘స్వీటీ భేషుగ్గా వుంది’ అనే సమాధానమే వస్తోంది. ఆ ముక్క ఏదో అనుష్క శెట్టి, మీడియా ముందుకొచ్చి చెప్పేస్తే పోలా.?

ప్చ్.. అలా మీడియా ముందుకొచ్చినా సరే.. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ‘అనుష్కకి మళ్ళీ ఏమయ్యింది.?’ అనే ప్రశ్నే వస్తుంది. అదంతే, ఈ గాసిప్పుల ప్రవాహం ఆగదంతే.!
అనుష్క శెట్టి అంటే, తెలుగు తెరపై జేజెమ్మ.. తిరుగులేని లేడీ సూపర్ స్టార్.! ఆమె చుట్టూ గాసిప్స్.. సర్వ సాధారణం.
