Anveshi Jain Vayyaaram 144.. అన్వేషి జైన్ తెలుసు కదా.? తెలియకపోవడమేంటి.? రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాలో ‘నా పేరు సీసా’ అంటూ ఓ స్పెషల్ సాంగ్ చేసింది కదా.!
అంతేనా, అంతకు ముందే అన్వేషి జైన్ చాలా పాపులర్. అది కూడా, ‘గందీ బాత్’ అనే వెబ్ సిరీస్ ద్వారా.! ఆ వెబ్ సిరీస్ అప్పట్లో పెను సంచలనం.!
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా కూడా అన్వేషి జైన్ తనదైన ప్రత్యేకతను చాటుకుంది. తన శరీరాకృతి తన బలం, బలహీనత.. అని పలు సందర్భాల్లో చెప్పిందామె.
హార్మోన్లు.. డిప్రెషన్..
హార్మోన్ సమస్యలతో, తన శరీరంలో కొన్ని భాగాలు అనూహ్యంగా పెరిగిపోతే, తాను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవాల్సి వచ్చిందని చెబుతుంటుంది అన్వేషి జైన్.
అయితే, ఆ డిప్రెషన్ నుంచి కోలుకుని, తన బలహీనతనే బలంగా మార్చుకుని, గ్లామరస్ ప్రపంచంలో రాణిస్తున్నానని అన్వేషి జైన్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది కూడా.

సోషల్ మీడియాలో వర్కవుట్ ఫొటోలు, ఇదిగో.. ఇలాంటి గ్లామరస్ ఫొటోలు పోస్ట్ చేస్తూ, ఫాలోవర్స్‌ని పెంచుకుంటూ వస్తోంది అన్వేషి జైన్.
కేవలం నటి మాత్రమే కాదు, డిప్రెషన్‌లో వున్నవారికి కౌన్సెలింగ్ కూడా ఇస్తుంటుంది.. ఈ బ్యూటీ.! తెలుగుతోపాటు పలు భాషల్లో ఇప్పటికే సినిమాలు చేసేసింది అన్వేషి జైన్.
అందం చూడవయా..
అందం చూడవయా.. ఆనందించవయా.. అని చెప్పే అన్వేషి జైన్, సోషల్ మీడియాలో తన మీద జరిగే ట్రోలింగ్‌ని అస్సలు పట్టించుకోదట.
పైగా, తనను ట్రోల్ చేసేవారి మీద అప్పుడప్పుడు జాలి కలుగుతుంటుందట అన్వేషి జైన్‌కి.! ‘సర్లే, వాళ్ళూ బతకాలి కదా..’ అని లైట్ తీసుకుంటుందీ అందాల భామ.

అందం అనేది కొలతల్లో వుండదనీ, శారీరక ఆరోగ్యం.. ముందర ‘అందం’ అనేది చిన్న విషయమని చెబుతోంది అన్వేషి జైన్.
అదీ నిజమే.! చూస్తున్నారు కదా.. వయ్యారం వన్ ఫార్టీ ఫోరూ.. అంటే, ఇదిగో ఇలా అన్వేషి జైన్‌లా వుంటుంది.