Manchu Manoj Lady Getup.. మంచు కుటుంబంలో చిచ్చు.. మోహన్‌బాబు, విష్ణు ఓ వైపు.. మంచు మనోజ్ ఇంకో వైపు. ఇంతకీ, మంచు లక్ష్మి ఎటువైపు.?
ప్రస్తుతానికైతే మంచు రచ్చకి సంబంధించి మంచు లక్ష్మి న్యూట్రల్‌గానే వుండిపోయింది. సో, నడుస్తున్న గొడవతో ఆమెకేమీ సంబంధం లేదన్నమాట.
ఆస్తి కోసం గొడవ కాదంటాడు మనోజ్. ఆస్థి కోసమే మనోజ్ రాద్ధాంతం చేస్తున్నాడని మనోజ్, విష్ణు అంటున్నారు. మధ్యలో మోహన్‌బాబు యూనివర్సిటీ మీద మనోజ్ ఆరోపణలు వేరే లెవల్.!
తాజాగా, మనోజ్ సినిమాల మీదకి మార్చాడు.. తన బాణాల్ని. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ సినిమాలో, తనకు ఇష్టం లేకపోయినా, విష్ణు కోసం లేడీ గెటప్ వేశానని మనోజ్ చెప్పుకొచ్చాడు.
‘నాకు ఏదన్నా హిట్ వస్తే, వెంటనే నన్ను లాక్ చేసేవారు. విష్ణుకి హిట్ కావాలి.. నువ్వు సహకరించాలి.. అని బ్లాక్‌మెయిల్ చేసేవారు..’ అంటూ మనోజ్ వాపోయాడు.
విష్ణు, మనోజ్.. ఇద్దరూ సినిమాల్లో సక్సెస్ అయ్యింది లేదు. సినిమాలు మాత్రం చేసుకుంటూ వెళుతున్నారు. మనోజ్ కొన్నాళ్ళుగా సినిమాలకు దూరమయ్యాడు.
విష్ణు, చాలా గ్యాప్ తీసుకుని ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాడు. మనోజ్ కూడా, ‘భైరవం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు.
మొత్తమ్మీద, మంచు కుటుంబం అయితే రోడ్డున పడిందన్నది నిర్వివాదాంశం. పోలీస్ స్టేషన్ల దాకా వెళ్ళింది వ్యవహారం. కోర్టులను ఆశ్రయించి, ‘స్టే’లు తెచ్చుకునే పరిస్థితి కూడా వచ్చింది.
‘క్రమశిక్షణ’ అంటూ, మంచు కుటుంబం పదే పదే.. గొప్పగా చెప్పేసుకుంటుంటుంది. ఇదా క్రమశిక్షణ అంటే.? రోడ్డున పడి, కొట్టుకోవడమేనా క్రమశిక్షణ అంటే.?
అయినా, ఈ లేడీ గెటప్పు గోలేంటి.? అప్పట్లో, మనోజ్ లేడీ గెటప్పు గురించి గొప్పగా చెప్పుకుంది మంచు కుటుంబం. ఇప్పుడేమో, ఇష్టం లేకుండా చేశానంటున్నాడు మనోజ్. ఇంతకీ, ఏది నిజం.?
మొత్తమ్మీద, మనోజ్ లేడీ గెటప్పు వల్ల పుట్టిన వల్గారిటీ కంటే, అసహ్యంగా వుంది మంచు కుటుంబంలో రాజుకున్న పంపకాల కుంపటి.