AP Jail Bail Politics ఒకాయన అక్రమాస్తుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్ళారు.ఏడాదిన్నర జైల్లో వున్న అనుభవం ఆయన సొంతం.!
ఇంకాయాన ఇటీవలే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో జైలుకు వెళ్ళారు. ఎప్పుడాయన బెయిల్ మీద విుడదవుతారో తెలియదు.
ఒకరు ముఖ్యమంత్రి.. ఇంకొకరు ప్రతిపక్ష నేత.! సరిపోయింది సంబరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం ఖర్మ ఇది.!
AP Jail Bail Politics.. ఢిల్లీలో పరువు తీసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ వ్యవహారాల గురించి నేషనల్ మీడియాకి వివరిస్తున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.
తన తండ్రిని అక్రమంగా అరెస్టు చేశారన్నది నారా లోకేష్ ఆరోపణ. మరోపక్క, చంద్రబాబుని స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌లో అరెస్టు చేసిన ఏపీ సీఐడీ కూ నేషనల్ మీడియాతో ఇంటరాక్త్ అవబోతోందట.

అసలేం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.1 రాష్ట్రం (Andhra Pradesh State) పరువుని ఢిల్లీలో ఎందుకు తీసేస్తున్నారు.?
‘నువ్వెంత నీ బతుకెంత.. నీ స్థాయి ఎంత..’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
రాష్ట్ర రాజకీయం చిత్ర విచిత్రంగా తయారైంది.! ప్రజలకు వాస్తవాలు తెలియదని కాదు.! తెలిసీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎలా ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టారు.?
ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
రాష్ట్రానికి రాజధాని వుందో లేదో తెలియదు.! పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే కనిపించడంలేదు.
Also Read: Pawan Kalyan.. ఈ ‘పవర్’ చాలా.! ఇంకేమైనా కావాలా.!
ఇన్ని సమస్యలున్నాయి రాష్ట్రానికి. కానీ, ఆ సమస్యల్ని రాజకీయ పార్టీలూ, ప్రజలూ పట్టించుకోకపోవడం అత్యంత శోచనీయం. రాష్ట్రంలో ప్రజలు కళ్ళు తెరవాలి.
తమ హక్కుల కోసం పోరాడాలి. అధికారంలో వున్నోళ్ళు కావొచ్చు, విపక్షంలో వున్నోళ్ళ కావొచ్చు.. రాష్ట్రం గురించి ఏం మాట్లాడుతున్నారు.? ఏం చేస్తున్నారనేది ఆలోచించుకోవాలి.
లేకపోతే, జైళ్ళే రాష్ట్ర పరిపాలన కేంద్రాలుగా మారిపోవచ్చు.!