Aparna Balamurali Law Student.. న్యాయ విద్యను అభ్యసిస్తోన్న ఓ స్టూడెంట్, మలయాళ నటి అపర్ణ బాలమురళితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.
ఆ న్యాయ విద్యార్థి ఇప్పటికే ‘తాత్కాలిక’ సస్పెన్షన్‌కి గురయ్యాడు. అయినాగానీ, చేసిన దుశ్చర్య పట్ల కించిత్ బాద కూడా ఆయనలో లేదట.
మరోపక్క, అపర్ణ బాలమురళి, ఆ న్యాయ విద్యార్థిపై ఎందుకు పోలీసులకు ఫిర్యాదు చేయలేదన్నది చర్చనీయాంశంగా మారింది.
Aparna Balamurali Law Student.. అపర్ణ ఎందుకు భయపడుతోంది.?
‘న్యాయ విద్యార్థివి. నీకు ఆ మాత్రం జ్ఞానం లేదా.?’ అంటూ తాజాగా స్పందించింది అపర్ణ బాల మురళి. పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు.? అన్న ప్రశ్నకు మాత్రం ఆమె సమాధానం దాటవేసింది.
సినీ తారలు జనంలోకి వెళ్ళినప్పుడు, అభిమానం పేరుతో కొందరు అత్యుత్సాహంతో కూడిన జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడటం మామూలే.
ఓ నటిగా అలాంటి సందర్భాల్ని బహుశా అపర్ణ బాలమురళి ఎన్నోసార్లు చవిచూసే వుంటుంది.
ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని..
వేదిక మీదకు వచ్చి అపర్ణను టచ్ చేసి, ఆమె నడుమ్మీద చెయ్యేసి.. గట్టిగా నొక్కి మరీ దగ్గరకు తీసుకున్నాడు న్యాయ విద్యార్ధి.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.? అని అనుకున్నాడో ఏమోగానీ.. అంత జుగుప్సాకరంగా వ్యవహరించాడు.
కాగా, వేదిక మీద సినీ తారలు తమ తమ సినిమాల ప్రమోషన్ల కోసం వచ్చి, ఆన్ స్క్రీన్ రొమాన్స్ తరహాలో రెచ్చిపోవడం మామూలే.
డేటింగుల గురించీ.. ఇతరత్రా వ్యవహారాల గురించి నిస్సిగ్గుగా మాట్లాడుతుంటారు. కొందరు సెలబ్రిటీలు, కుర్రకారుని కౌగలింతల్లోనూ ముంచెత్తేస్తారు.
Also Read: Nithya Menen.. టీచరమ్మ పాఠం.. వాళ్ళకి గుణపాఠం.!
బహుశా అలా పొరపడినట్లున్నాడు ఆ న్యాయ విద్యార్థి అన్నది ఓ వెర్షన్.
వివాదాన్ని పెద్దది చేయకూడదని సదరు సంస్థ యాజమాన్యం విజ్ఞప్తి చేయడంతోనే అపర్ణ బాలమురళి, పోలీసులను ఆశ్రయించలేదన్నది తాజా ఖబర్.
అపర్ణకి ఆమె సన్నిహితులు కూడా ఈ వివాదాన్ని ఇక్కడితో వదిలెయ్యాలని సూచించారట. దాంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు విషయంలో వెనక్కి తగ్గిందట.