వైసీపీ ఓటమి.! వైఎస్ జగన్ స్వయంకృతాపరాధమే.!

 వైసీపీ ఓటమి.! వైఎస్ జగన్ స్వయంకృతాపరాధమే.!

Ys Jagan Mohan Reddy

YSRCP Jagan Distruction Politcs.. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీలో 151 మంది శాసన సభ్యులున్నప్పుడు వైసీపీ హంగామా వేరు.! ఆ సంఖ్య 11కి పడిపోయాక.. ఆ పార్టీ పరిస్థితి వేరు.!

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ప్రజా తీర్పుని ఎవరైనా శిరసావహించాల్సిందే. అంతే తప్ప, ‘మోసపోయాం’ అంటూ నింద ప్రజల మీద మోపేస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

‘ఆ ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు ఏమైపోయాయో..’ అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అమాయకంగా నటిస్తూ చేస్తున్న వ్యాఖ్యలు, వైసీపీకి ముందు ముందు జనం ‘గుండు సున్నా’ కొట్టేసే పరిస్థితిని తీసుకురావొచ్చు.

YSRCP Jagan Distruction Politcs.. అదీ, ఇదీ.. ప్రజా తీర్పే.!

2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అయినా, 2024 ఎన్నికల్లో వైసీపీ ఓటమి అయినా.. రెండూ ప్రజా తీర్పులే.! చంద్రబాబు హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి. వైసీపీ హయాంలోనూ సంక్షేమ పథకాలు అమలయ్యాయి.

కానీ, సంక్షేమ పథకాలు చూసి ఓట్లెయ్యరు జనం.! ఇది 2019 ఎన్నికలు, 2024 ఎన్నికలు చెప్పిన సత్యం. రాజకీయ పార్టీలే, ఈ విషయమై ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వుంది.

అధికారంలోకి వచ్చాక, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏం చేశారు.? మొట్టమొదట చేసింది ప్రజా వేదిక కూల్చివేత. అప్పటినుంచి రాష్ట్రం అతలాకుతలం అవుతూనే వచ్చింది.చివరికి వైసీపీ కూల్చివేత వరకూ వెళ్ళింది పరిస్థితి.

Jagan Distruction Politcs.. ఓటమిపై విశ్లేషణ ఏదీ.?

ముందే చెప్పుకున్నట్టు రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిపై విశ్లేషించుకోవాలి. ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలి.

బూతులు తిట్టే మంత్రులు.. బూతులతో సోషల్ మీడియా వేదికగా చెలరేగిపోయే నీలి కూలీలు.. వైసీపీ ఓటమికి ఇంతకన్నా ప్రత్యేకమైన కారణాలు ఏమైనా కావాలా.?

Ys Jagan Mohan Reddy
Ys Jagan Mohan Reddy

ఏ వేదిక మీద మాట్లాడినా, పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ ప్రస్తావనే చేశారు ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.

సమాజం, ఓ రాజకీయ పార్టీని, అధికారంలో వున్న వ్యక్తిని ఛీత్కరించుకోవడానికి ఇంతకన్నా బలమైన కారణం ఇంకేం అవసరమవుతుంది.?

ప్రభుత్వమే శాశ్వతం..

ప్రభుత్వం అనేది శాశ్వతం.. ఆ ప్రభుత్వాన్ని నడిపే పార్టీలే మారుతుంటాయ్. ప్రభుత్వాన్ని నడిపే అవకాశం తనకు లభించినప్పుడు, బాధ్యతగా వ్యవహరించాలి.

కానీ, రాజధాని పేరుతో నాటకమాడారు. కమ్మరావతి.. అంటూ అవమానించారు. కూకట్‌పల్లి ఆంటీలంటూ రాజధాని కోసం భూములిచ్చిన మహిళా రైతుల్ని హేళన చేశారు.

వాట్ నాట్.. చెప్పుకుంటూ పోతే తప్పిదాలు పదుల సంఖ్యలో కాదు, వందల సంఖ్యలో వుంటాయి.. ఔను, గడచిన ఐదేళ్ళ వైసీపీ ప్రస్తావన అంటే, పాపాల పుట్ట. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.

Also Read: చిరంజీవిని చూసి మొరిగితే, చిరంజీవికి చేటా.?

సొంత మీడియాకి దోచి పెట్టడం.. సొంత సైన్యాన్ని ప్రజా ధనంతో మేపడం.. చెప్పుకుంటూ పోతే, ఈ దోపిడీ వేరే లెక్క.! బోడి సలహాదారుల వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా నష్టమే కాదు, వైసీపీ కూడా నష్టపోయిందని జగన్ తెలుసుకోకపోతే ఎలా.?

ఇంత జరిగాక కూడా మార్పు కనిపించడంలేదు వైసీపీలో. టీడీపీకి సింగిల్ డిజిట్ రావడానికి ఎంతో దూరం లేదంటూ వైఎస్ జగన్ వ్యాఖ్యానిస్తున్నారు.

టీడీపీ సంగతి తర్వాత, ముందైతే.. వైసీపీ కాలగర్భంలో కలిసిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను జగన్ విస్మరిస్తే ఎలా.?

Digiqole Ad

Related post