Aravind Kejriwal New Baahubali: ఆమ్ ఆద్మీ పార్టీ పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగిపోతోందంటే దానికి కారణం, ఓ సామాన్యుడు సాధించిన అసామాన్యమైన విజయమే.
ఓ సాధారణ వ్యక్తి కొత్త రాజకీయ పార్టీని స్థాపించి, అప్పటికే బలంగా పాతుకుపోయిన రెండు జాతీయ పార్టీల్ని ఢిల్లీలో మట్టికరిపించడం సామాన్యమైన విషయం కాదు మరి.!
అరవింద్ కేజ్రీవాల్.. ఓ బ్రాండ్ నేమ్.!
అరవింద్ కేజ్రీవాల్.. పరిచయం అక్కర్లేని పేరిది. అన్నా హజారే చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ఆయనకు చేదోడు వాదోడుగా వున్న బృందంలో ఓ వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్. ఆ తర్వాత ఆయన సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు.
అప్పట్లో అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) పార్టీకి అన్నా హజారే నుంచి కూడా ఆశించిన స్థాయిలో మద్దతు రాలేదు. సరే, ఢిల్లీలో తలపండిన రాజకీయ నాయకుల్ని ఎలా అరవింద్ కేజ్రీవాల్ తన ‘సామాన్యుడు’ ట్యాగ్‌తో బోల్తా కొట్టిందీ దేశమంతా చూసిందనుకోండి.. అది వేరే సంగతి.
ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఇప్పుడు పంజాబ్ రాష్ట్రానికీ విస్తరించింది. అక్కడా అధికారంలోకి వచ్చింది. గోవాపైనా కన్నేసిందిగానీ, అక్కడ సరైన ఫలితాల్ని సాధించలేకపోయింది కేజ్రీవాల్ పార్టీ.
Aravind Kejriwal New Baahubali.. ప్రధాని పీఠంపై కన్నేసిన సామాన్యుడు.!
వచ్చే ఎన్నికల నాటికి.. అంటే, 2024 ఎన్నికల నాటికి భారతీయ జనతా పార్టీకి (Bharatiya Janata Party) ధీటైన రాజకీయ ప్రత్యామ్నాయంగా దేశంలో ఎదుగుతామనే విశ్వాసం పంజాబ్ ఎన్నికల ఫలితాల తర్వాత వ్యక్తం చేశారు అరవింద్ కేజ్రీవాల్.
కానీ, నరేంద్ర మోడీ (Narendra Modi) నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీని ఢీకొనడం అరవింద్ కేజ్రీవాల్‌కి అంత తేలిక కాదు. అలాగని అది అసాధ్యమూ కాదు. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. కాలం కలిసొచ్చి, అరవింద్ కేజ్రీవాల్ దేశ ప్రధాని పీఠంపై కూర్చున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
Also Read: మూడో ప్రపంచ యుద్ధం.! మానవ జాతి వినాశనం.!
ఇక్కడో కీలకమైన అంశం గురించి మాట్లాడుకోవాలి. సామాన్యుడు అసామాన్య విజయాలు సాధించాలంటే.. మార్పు అన్న ఆలోచన దిశగా సామాన్యుడు చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి. ఆ సామాన్యుడికి, అలాంటి సామాన్యుల నుంచే సరైన మద్దతు లభించాలి.!