Khiladi Telugu Review: తెర నిండా బోల్డంత మంది ప్రముఖ నటీనటులు.. ఖర్చు విషయంలో ఎక్కడా తగ్గకుండా బారీ నిర్మాణ వ్యయం.. అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని.. అంటే ఏంటో తెలుసా.? ‘ఖిలాడీ’ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది.
సినిమాని ఇలాక్కూడా తీయొచ్చా.? అని సినిమా చూశాక మీకనిపిస్తే అది మీ తప్పు కాదు.
ఇద్దరు హీరోయిన్లు డింపుల్ హయాతి (Dimple Hayathi), మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).. గ్లామర్ విషయంలో అస్సలేమాత్రం మొహమాటపడలేదు. ఈ ఇద్దరికీ తోడు అనసూయ (Anasuya Bharadwaj) ఎక్స్‌ట్రా లగేజీ.. గ్లామర్ పరంగా.! అయినా అక్కడ అంతా శూన్యం.!
Khiladi Telugu Review.. కథా లేదు, కాకరకాయా లేదు.!
అసలు కథేంటంటే… అని మాట్లాడుకోడానికీ వీల్లేదు. తెరపై ఏవేవో జరిగిపోతుంటాయి. కంట్రోల్ తప్పిన కారైనా ఏదో ఒక చెట్టుని ఢీకొట్టి ఆగిపోతుందేమో.. అసలు ఈ సినిమాలో ట్విస్టులు ఆగనే ఆగవు.
సినిమాని ముగించెయ్యాలి కాబట్టి, వున్నపళంగా హీరోలో మార్పు వచ్చేస్తుంది. సినిమా ముగిసిపోతుంది.

కానీ, ఎండ్ టైటిల్స్‌లో మళ్ళీ మిమ్మల్ని ఫూల్‌ని చేస్తాడు దర్శకుడు. ‘ఖిలాడీ’ (Khiladi) రెండో పార్ట్ కూడా వుందని భయపెడతాడు.!
బోల్డంత బడ్జెట్.. విచ్చలవిడిగా ఖర్చు చేసేశారు. హీరోయిన్ల గ్లామర్‌ని అంత విచ్చలవిడిగా వాడేయాల్సిన ఖర్మ ఏంటో.! అసలు అనసూయ (Anasuya Bharadwaj) ఎందుకంత హాటుగా కన్పించిందో.! ఫస్టాఫ్ అంతా ఓ నాటకం, సెకెండాఫ్ మరో నాటకం.
ఎవరెవరో.. ఏదేదో చేసేశారు.!
అందరూ నటించేస్తున్నామని అనుకుంటారు.. అదంతా తెరపై చూస్తోంటే, ఏదీ నిజమనిపించదు. ఈ విషయంలో ప్రేక్షకుడికైతే ఓ క్లారిటీ దాదాపుగా వచ్చేస్తుంది.! కానీ, ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చేస్తున్నామనుకుని.. ప్రతిసారీ బోల్తా పడింది ‘ఖిలాడీ’ టీమ్.
బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్.. అందమైన లొకేషన్స్.. ముందే చెప్పుకున్నాం కదా, అన్నీ వున్నా అల్లుడి నోట్లో శని అని.!
Also Read: సమంత అందాల దాడి.! ఊ అంటారా.. ‘నో’ అనగలరా.!
పాటలు మాస్‌ని అలరించేలా సినిమా విడుదలకు ముందే హిట్టయిపోయాయి. తెరపై చూడ్డానికి కూడా బాగానే వున్నాయి.. హీరోయిన్లు డాన్సులు బాగానే వేశారు. అంతకన్నా బాగా గ్లామర్ చూపించేశారు.
అంతే, అంతకు మించి సినిమా గురించి మాట్లాడుకోడానికి ఏమీ లేదు. ఎవరూ నటించలేదు, జీవించలేదు. ఏదేదో చేసేశారు. అంతా గందరగోళమే. సినిమా పూర్తయ్యాక ఎవరి నటనా గుర్తుకు రాదు.
రవితేజ (Mass Maharaja Raviteja) అంటేనే ఎనర్జీ.. ఈ సినిమాలో ఒకటి రెండు చోట్ల ఆ ఎనర్జీ కనిపించీ కనిపించనట్టు వుంటుందంతే. చాలా సీన్స్‌లో రవితేజ పూర్తిగా కాన్ఫిడెన్స్ కోల్పోయినట్లుగా కనిపిస్తాడు. అలాక్కూడా అభిమానుల్ని బాగా ఇబ్బంది పెట్టాడు రవితేజ.
అసలు ఈ కథలో ఏముందని రవితేజ ఒప్పుకున్నట్టు.? అంటే, కథా కాకరకాయ్ గురించి రవితేజ ఎప్పుడో మర్చిపోయాడని అనుకోవాలేమో.!