పాపం అరియానా.. కెప్టెన్సీ దక్కినా ఆమెకు కష్టాలు తప్పడంలేదు. రేషన్ మేనేజర్‌గా మోనాల్‌ని ఆమె ఎన్నుకోవడంపై అమ్మ రాజశేఖర్ గుస్సా అయ్యాడు. దాంతో అరియానాకి (Ariyana Glory Captain BIgg Boss Telugu 4) ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. కెప్టెన్సీ టాస్క్‌లో చివరి పోటీ అరియానా – మోనాల్ మధ్య పడింది.
అమ్మ రాజశేఖర్ డిసైడింగ్ ఫ్యాక్టర్. అరియానాకి ఓటేశాడు.. అలా అరియానా కెప్టెన్ అయ్యింది. అంతలోనే అమ్మ రాజశేఖర్‌తో అరియానాకి గొడవ. కాదు కాదు, అరియానాతోనే అమ్మ రాజశేఖర్ గొడవ.
ఇంకోపక్క రేషన్ మేనేజర్ మోనాల్, ఫ్రూట్స్ తీసుకొచ్చి.. పాడైపోయాయని చెబితే, పాత కెప్టెన్ అవినాష్ ‘నాకేంటి సంబంధం.?’ అని ప్రశ్నించాడు. దాంతో అరియానా బాగా హర్టయ్యింది. మోనాల్ తననేదో వెటకారం చేసినట్లు అరియానా ఫీలయ్యింది.
నన్నెవరూ నిజంగా సపోర్ట్ చేయడంలేదు.. కెప్టెన్ అవడానికి సాయం చేసినోళ్ళే, ఇప్పుడు నాతో ఆడుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం, ఆమెను ఓదార్చే ప్రయత్నమూ ఎవరూ చేయలేదు. అరియానా – అవినాష్ మధ్య గత వారం కెప్టెన్సీ టాస్క్ నడిస్తే, అవినాష్ గెలిచాడు.. అరియానాకి రేషన్ మేనేజర్‌గా అవకాశమిచ్చాడు.
అదే ఫార్మాట్‌ని అరియానా ఫాలో అయినట్లుంది.. తనతోపాటు చివరి వరకు కెప్టెన్సీ టాస్క్‌లో పోటీ పడ్డ మోనాల్‌కి రేషన్ మేనేజర్ పోస్ట్ ఇచ్చింది.. అది కాస్తా ఆమెకు శాపంగా మారినట్టుంది. ‘నేను మోనాల్‌కి రేషన్ మేనేజర్ విషయమై హామీ ఇస్తే, దాన్ని నెరవేర్చడానికి నువ్వెవరు.?’ అంటూ అరియానాపై అమ్మ రాజశేఖర్ మండిపడుతోంటే, ఈ క్రమంలో అరియానాకి హౌస్‌లో ఎవరూ సపోర్ట్‌గా నిలవలేదు.
కాగా, ‘నేను ఒక అమ్మాయిని.. కెప్టెన్సీ కోసం ప్రయత్నిస్తున్నాను.. అది నా కల..’ అంటూ అరియానా, కెప్టెన్సీ కోసం చాలానే ఎమోషనల్ అయి, కెప్టెన్సీని సాధించినా, ‘ఎందుకీ కెప్టెన్సీ.. దండగ..’ అనే స్థాయికి ఆమెని (Ariyana Glory Captain BIgg Boss Telugu 4) హౌస్‌మేట్స్ ర్యాగింగ్ చేస్తున్నట్టుంది పరిస్థితి.