హౌస్‌లోకి రావడమొక్కటే మీ ఇష్టం.. హౌస్‌లో వుండాలో వద్దో తేల్చేది మాత్రం జనమేనంటాడు ‘బిగ్‌బాస్’ హోస్ట్. కానీ, కంటెస్టెంట్లు మాత్రం ‘మాకొద్దీ బిగ్‌బాస్’ (Ariyana Glory Over Smart) అనడం మామూలైపోయింది. ధన్ రాజ్, సంపూర్ణేష్‌బాబు.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ బాగానే కనిపిస్తుంది.
ఈ సీజన్ విషయానికొస్తే, ‘నేను హౌస్‌లో వుండను మొర్రో..’ అని చెప్పిన క్యాండిడేట్స్ లిస్ట్‌లో ముందుగా గంగవ్వ పేరు వినిపిస్తుంది. అమ్మ రాజశేఖర్ తదితరులూ ఇదే మాట చెప్పారు. ఇప్పుడేమో అరియానా గ్లోరీ, తనను హౌస్ నుంచి పంపించెయ్యమంటోంది.. బిగ్‌బాస్‌ని వేడుకుంటోంది.
హౌస్‌లో తనను అందరూ పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతోంది. ఇదో టైపు ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ అని జనం అనుకుంటున్నారన్న విషయం ఆమెకు తెలియదా.? ఎందుకు తెలియదు, గత సీజన్లను ఔపోసన పట్టేసే వచ్చారు హౌస్‌లోకి కంటెస్టెంట్స్ అంతా.
అరియానా, రెండాకులు ఎక్కువే చదివేసింది.. గత సీజన్లని. ఈ సీజన్‌లో ఎలాగైనా మహిళా కంటెస్టెంట్ విజేతగా నిలవాలన్నది అరియానా టార్గెట్. ఆ మహిళ ఎవరో కాదు, తానే అవ్వాలని కూడా ఆమె అనుకుంటోంది. కానీ, పరిస్థితులేమో ఆమెకు యాంటీగా కనిపిస్తున్నాయి.
ప్రతివారం తనను ఇతర కంటెస్టెంట్స్ నామినేట్ చేస్తూ వస్తోంటే, క్రమక్రమంగా ఆమెలో భయం పెరుగుతున్నట్లుంది. ప్రస్తుతానికి అవినాష్ తప్ప అరియానాని ఎవరూ హౌస్‌లో అర్థం చేసుకోవట్లేదట. ఎవరి ఆట వాళ్ళే ఆడుకోవాలన్నప్పుడు ఎవరైనా ఎందుకు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు.? అన్నదీ ఆమె ఆలోచించుకోవాలి.
అయితే, హౌస్‌లో గ్రూపులున్నాయి. ఆ గ్రూప్ అంతా ఒక్కటై అరియానాని నామినేట్ చేస్తుండడంతో, ఆమెకు వేరే ఆప్షన్ కనిపించడంలేదన్నమాట. అమ్మ రాజశేఖర్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయాడు.. లిస్ట్‌లో నెక్స్‌ట్ ఆమె పేరేననే చర్చ సోషల్ మీడియాలోనూ జరుగుతోంది.
అరియానా కూడా కోరుకుంటోంది కాబట్టి, బిగ్‌బాస్ ఇంకాస్త ‘బిగ్’ మనసు చేసుకుని, ఆమెను (Ariyana Glory Over Smart) బయటకు పంపించేస్తాడేమో చూడాలిక.