అవినాష్‌ని ఉద్దేశించి మంచి స్నేహితుడిగా అభివర్ణించే అరియానా గ్లోరీ, అనూహ్యంగా అవినాష్‌ని వరస్ట్ పెర్ఫామర్‌గా (Ariyana Vs Avinash Bigg Boss Telugu 4) అభివర్ణించేసింది. పైగా, సమయం.. సందర్భం లేకుండా ఆమె చేసిన కామెంట్ అది. ‘పల్లెకు పోదాం ఛలో ఛలో’ టాస్క్‌లో భాగంగా ఎవరికి వారు మంచి పెర్ఫామెన్స్ ఇచ్చారు.
ఆ విషయాన్ని బిగ్‌బాస్ స్వయంగా వెల్లడించాడు కూడా. కానీ, ఎందుకో అరియానాకి అవినాష్ పెర్ఫామెన్స్ నచ్చలేదట. అది టాస్క్ కదా.. అని అవినాష్ చెప్పబోతే, ‘నీ బిహేవియర్ నాకు నచ్చలేదు..’ అంటూ అర్థం పర్థం లేని రీజన్ ఇచ్చింది.
‘నువ్వంతే.. పైకి ఏదో చెబుతావు, లోపల ఇంకోటేదో అనుకుంటావు. ఒకరి మీద ఓ ఒపీనియన్ వుంటుంది.. దాన్ని ఇతరుల మీదకు నెట్టేస్తావ్..’ అని అవినాష్ కుండబద్దలుగొట్టేశాడు. ‘ఇకపై నా గురించి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, అసలు నాతో మాట్లాడొద్దు..’ అని అవినాష్, అరియానాకి తేల్చి చెప్పేయడం గమనార్హం.
కెప్టెన్సీ టాస్క్ కోసం అమ్మ రాజశేఖర్, హారిక ఎంపిక కాగా.. ఇప్పటికే కెప్టెన్‌గా వున్న అరియానాని ఎవరో ఒకర్ని కెప్టెన్సీ టాస్క్‌కి నామినేట్ చేయాలని బిగ్‌బాస్ కోరాడు. ‘నిన్ను నువ్వు నామినేట్ చేసుకోవచ్చు..’ అని కూడా చెప్పడంతో, ఇంకో ఆలోచన లేకుండా అరియానా తన పేరునే మళ్ళీ కెప్టెన్సీ కోసం నామినేట్ చేసుకుంది.
అయితే, ‘బెస్ట్ పెర్ఫామర్‌గా అవినాష్ వున్నాడుగానీ.. నాకు వచ్చిన అవకాశాన్ని నేను వదులుకోదలచుకోలేదు.. హౌస్‌లో అందరూ బాగా పెర్ఫావ్‌ు చేశారు.. క్షమించండి.. నన్ను సపోర్ట్ చేయండి..’ అంటూ అరియానా ‘ట్రూ కలర్స్’ బయటపెట్టేసుకుంది. అరియానా మొదటి నుంచీ ఇదే ‘డ్యూయల్ టోన్’ బిహేవియర్‌ని మెయిన్‌టెయిన్ చేస్తోంది.
వీలైతే ‘అమ్మాయి’ కార్డు తెరపైకి తెస్తుంటుంది.. ఫిజికల్‌గా వీక్.. అంటూ చేతులెత్తేస్తుంటుంది.. స్క్రీన్ స్పేస్ కోసం ఎక్కువగా అరిచేయడం, ఎవరో ఒకరితో గొడవ పెట్టుకోవడం.. ఇలాంటివన్నీ అరియానాకి అలవాటే. ఏదిఏమైనా అవినాష్ విషయంలో ఆమె అసలు రంగు (Ariyana Vs Avinash Bigg Boss Telugu 4) బయటపడిపోవడం కొసమెరుపు.