నాన్నకు ప్రేమతో.. అంటూ నాన్న ప్రేమను గుర్తు చేసుకోవాల్సిన రోజది. అదే ఫాదర్స్ డే. ‘హ్యాపీ ఫాదర్స్ డే’ (Anurag Kashyap Aaliyah Kashyap Controversial Interview) అని ఒక్కరోజు పండగ చేసుకుంటే సరిపోతుందా.? నిజానికి, మన భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, మన కుటుంబ వ్యవస్థ.. ఇవన్నీ పరిశీలిస్తే.. ప్రతిరోజూ ‘హ్యాపీ ఫాదర్స్ డే’ కనిపిస్తుంది. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. విదేశాల్లో పరిస్థితి అది కాదు. ఎవరు పెంపుడు తండ్రి.? ఎవరు అసలు తండ్రి.? అనేది తెలుసుకోవడం కష్టమక్కడ.
సరే, అసలు విషయంలోకి వస్తే.. ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ అనురాగ్ కశ్చప్, ఆయన కుమార్తె అలియా కశ్యప్ మధ్య ఓ ఇంటర్వ్యూ జరిగింది. అలియా ఇంటర్వ్యూ చేస్తోంటే, అనురాగ్ ఆమె సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పాడు.
Also Read: చింపేస్తాం.. పోగులే ధరిస్తాం.. అంతా మా ఇష్టం.!
‘నా బాయ్ ఫ్రెండ్.. నేనూ మీ కళ్ళెదరుగానే.. పెళ్ళి కాకుండానే.. మీ ఇంట్లోనే తిరుగుతోంటే, మీకెలా అనిపిస్తుంది.?’ అన్నది ఓ ప్రశ్న. ‘పెళ్ళికి ముందు నేను గర్భవతినైతే మీ ఫీలింగ్స్ ఏంటి.?’ అన్నది ఇంకో ప్రశ్న. ‘నేను పోర్న్ చూస్తోంటే.. అది మీకు తెలిస్తే మీరెలా స్పందిస్తారు.?’ అన్నది ఇంకో ప్రశ్న.
మామూలుగా అయితే, ఇలాంటి ప్రశ్నలు ఏ కూతురు.. ఏ తండ్రిని అడిగినా.. ఆ తండ్రి బిక్క చచ్చిపోతాడు. కానీ, ఇక్కడ విషయం వేరు. అనురాగ్ కశ్యప్, ఆయన కుమార్తె అలియా కశ్యప్.. గొప్ప వ్యక్తులు.. సమాజాన్ని చదివేశారు. అందుకే, ‘బోల్డ్’ ప్రశ్నలు, అంతకన్నా ‘బోల్డ్’ సమాధానాలూ వచ్చేశాయి. నిజానికి, కాస్త బాధ్యతగానే అనురాగ్ సమాధానమిచ్చాడునుకోవాలి. పచ్చిగా సమాధానమిచ్చి వుంటే వ్యవహారం మరోలా వుండేది.
Also Read: అన్వేషి జైన్: ‘ప్లస్ సైజ్’.. అది నా తప్పు కాదు.!
నవ్విపోదురుగాక మనకేటి సిగ్గు.? అన్నట్టు తయారైంది వ్యవహారం. లేకపోతే, పెళ్ళికి ముందు సెక్స్ గురించి తండ్రితో కూతురు మాట్లాడటమా.? ఇందులో తప్పేముంది.. అని ఎవరైనా ప్రశ్నించగలిగితే, అంతకన్నా దిగజారుడుతనం ఇంకోటుండదు.
కానీ, సమాజం మారిపోయింది. ఇంటర్నెట్ తెరిచి చూస్తే.. అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరికేస్తాయి. కానీ, తండ్రినే.. అడగకూడని ప్రశ్నలు (Anurag Kashyap Aaliyah Kashyap Controversial Interview) అడిగితే.. అందులో ఆ సెక్సప్పీల్ ఇచ్చే కిక్కే వేరప్పా. అదే.. అందుకే అలా ప్లాన్ చేశారన్నమాట.