సయ్యద్ సోహెల్ రియాన్.. బిగ్‌బాస్ తెలుగు నాలుగో సీజన్‌లో సూపర్బ్ ఎనర్జీతో కన్పిస్తోన్న కంటెస్టెంట్. కానీ, కోపమొక్కటే చాలా ఎక్కువ. అది కూడా చాలా చాలా చాలా ఎక్కువ. అదే అతనికి (Sohel Bigg Boss Telugu 4) అతి పెద్ద సమస్య. కోపం ఎవరికి వుండదు.? చాలామందిలో కోపం చాలా చాలా ఎక్కువే వుంటుంది.
సోహెల్‌కి కోపమొక్కటే కాదు, ఇంకా చాలా చాలా ఎక్కువ వున్నాయ్. వాటిల్లో, ‘రివెంజ్’ కూడా ఒకటి. అరియానా మీద రివెంజ్ తీర్చుకోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు.. ఆ కోపాన్ని తీర్చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ, అతని రివెంజ్, అతను అనుకున్న స్థాయిలో తీరడంలేదు. అదే అసలు సమస్య.
ఈ క్రమంలో సోహెల్ సంయమనం కోల్పోతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, పిచ్చోడిలా మారిపోతున్నాడు సోహెల్. ఆటోమేటిక్‌గా సోహెల్ ఓవరాక్షన్ కాస్తా, అరియానా గ్లోరీకి పెద్ద ప్లస్ పాయింట్‌గా మారిపోయింది. ఆమె పట్ల బిగ్‌బాస్ వీక్షకుల్లో సింపతీ క్రియేట్ అయ్యింది.

‘ఇక చాలు..’ అని అఖిల్ చెప్పినా, అబిజీత్ చెప్పినా, హౌస్‌లో ఇంకెవరు చెప్పినా.. అరియానాతో గొడవని అక్కడితో వదిలెయ్యట్లేదు సోహెల్. ఇదంతా అతనికి ఇచ్చిన సీక్రెట్ టాస్క్ అయి వుండొచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నా, అది నిజం కాకపోవచ్చు.
వున్నపళంగా సోహెల్‌ని, ‘ప్యాక్ యువర్ బ్యాగ్స్’ అని బిగ్ బాస్ కావొచ్చు, హోస్ట్ అక్కినేని నాగార్జున కావొచ్చు.. అనేంతలా దారుణమైన బిహేవియర్‌లోకి సోహెల్ వెళ్ళిపోతున్నాడు. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోతే ఎలా.? టైటిల్ విన్నర్ అవ్వాల్సినోడు.. గొప్పలకు పోయి, త్యాగాలు చేసేసి.. తన పరిస్థితిని క్లిష్టతరం చేసుకుంటున్నాడు.
తాజా ఎపిసోడ్‌లో కూడా డాన్స్ ఫ్లోర్ మీద డాన్స్ చేస్తూ, పంచాయితీ పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. అబిజీత్ ఔట్ అయిపోవడంతో విషయం అక్కడితో చల్లారిపోయింది. ఎలాగూ డాన్స్ ఫ్లోర్ మీద నుంచి దిగక తప్పలేదు.. అలాంటప్పుడు ఎందుకు గొడవ.? అరియానా ఆర్గ్యుమెంట్ చేసిందంటే అదో లెక్క.. ఆ సమయంలో సోహెల్ దిగిపోయి వుండొచ్చుగాక.!
‘నా ఇష్టం నేను గేమ్ ఆడతా..’ అని చెప్పే సోహెల్, ఇతరులు గేమ్ ఆడుతోంటే, తట్టుకోలేకపోవడమేంటో.! ‘నేను రివెంజ్ తీర్చుకుంటున్నా..’ అని బాహాటంగా చెప్పేశాక, ఇతరుల ఆటలో లోటుపాట్లను డిస్కస్ చేసేందుకు నైతిక హక్కు ఏమాత్రం లేదు సోహెల్‌కి. తన కోపమే తన శతృవు.. అంటారు పెద్దలు. సోహెల్ విషయంలో అది నిజం.