బిగ్ లాస్.! ఫుటేజ్ కోసం కక్కుర్తి.!
Rathika Rose Bigg Boss Telugu 7
BiggBoss Rathika Rose Footage.. బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ అంతకు ముందు సీజన్లతో పోల్చితే కొంత ఇంట్రెస్టింగ్‌గానే సాగుతోంది. వ్యూయర్‌షిప్ కూడా పెరుగుతున్నట్లే వుంది.
కానీ, కంటెస్టెంట్లలో కొందరి తీరు మాత్రం, ఫుటేజ్ కోసం కక్కుర్తి అన్నట్లుంది.! ప్రధానంగా శోభా శెట్టి, దామిని తదితరుల తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
శుభశ్రీ రాయగురు కూడా అంతే.! ప్రిన్స్ యావర్ సంగతి సరే సరి. గౌతమ్ కృష్ణనీ తక్కువ చేసి చూడలేం ఈ విషయంలో.
అమర్‌దీప్ చౌదరి కావొచ్చు, ఇంకొకరు కావచ్చు.. ఒకే స్క్రిప్టుని ఫాలో అవుతున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, షకీలా, శివాజీ లాంటి సీనియర్లదీ అదే పరిస్థితి.
BiggBoss Rathika Rose Footage.. ఫుటేజ్ కష్టాలు.!
ప్రియాంక జైన్ ఒకింత బెటర్.! రతిక క్యూట్‌గా ఆకట్టుకుంటున్నా, ఆమె కూడా ఫుటేజ్ కోసం గేమ్స్ ప్లే చేయక తప్పడంలేదు.
మరో ఇంట్రెస్టింగ్ కంటెస్టెంట్ పల్లవి ప్రశాంత్ అయితే, మహా నటుడైపోయాడు. టేస్టీ తేజ కూడా తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ఈ విషయంలో.
ఒకరు తక్కువా కాదు.. ఇంకొకరు ఎక్కువా కాదు.. అందరూ ఒకటే అన్నట్లుగా ఈ సీజన్ నడుస్తోంది. కాకపోతే, కంటెంట్ ఇస్తున్నారు.
బిగ్ బాస్ మీద మొదటి నుంచీ ‘స్క్రిప్టెడ్’ అన్న విమర్శలున్నాయ్. సో, ఈ విషయమై కొత్తగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఈసారి బాగా డైరెక్ట్ చేస్తున్నారు కంటెస్టెంట్లని.
నటనలో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నా, కాస్త సహజంగా అనిపిస్తోంది మాత్రం రతిక రోజ్ విషయంలోనే.!
Also Read: Malaika Arora: ఇంతకీ నీ వయసెంత పాపా.!
క్యూట్ అండ్ లవ్లీ లుక్స్, బబ్లీ బాడీ లాంగ్వేజ్.. బ్యూటిఫుల్ డ్రెస్సింగ్.. ఇవన్నీ రతిక రోజ్‌ని మిగతా కంటెస్టెంట్ల కంటే భిన్నంగా వుంచుతున్నాయి.
కాగా, ఏదన్నా ఓ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతోంటే, దాంతో సంబంధం లేనోళ్ళు కూడా, అందులోకి దిగేస్తున్నారు.. ఫుటేజ్ కోసం.
మేం మంచోళ్ళం బిగ్ బాస్.. అనిపించుకోవడానికి కంటెస్టెంట్లు పడుతున్న కక్కుర్తి.. ఈ సీజన్ ప్రత్యేకత అనుకోవాలేమో.! వీకెండ్ ఎపిసోడ్ నేపథ్యంలో హోస్ట్ నాగార్జున, ఈ ఫుటేజీ పాట్లు గురించి మాట్లాడతాడా.?