Artificial Intelligence Prompt Vulgarity.. చిన్న పిల్లాడు కూడా ఇచ్చేయగలిగే ప్రాంప్ట్.! ఆ తర్వాత, దానికి తగ్గట్టుగా ఇమేజ్ జనరేట్ అయిపోతుందంతే.!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతం ఇది.! విదేశాలకు ఎటూ వెళ్ళలేం.. వెళ్ళినట్లుగా ఇమేజ్ క్రియేట్ చేసుకోగలుగుతున్నాం.. అది చూసి మురిసిపోతున్నాం.!
ఫొటోలు మాత్రమేనా.? వీడియోలు కూడా.! చనిపోయిన తల్లిదండ్రుల్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో.. వీడియోల్లో చూసుకుంటున్నాం.. వాళ్ళ మాటల్నీ వింటున్నాం.!
నాణేనికి రెండు వైపులున్నట్లే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లోనూ ఇంకో కోణం వుంది. అదే, అత్యంత దారుణమైన, అసభ్యకరమైన కోణం.!
Artificial Intelligence Prompt Vulgarity.. సెలబ్రిటీలే సాఫ్ట్ టార్గెట్స్..
సెలబ్రిటీలు ఎప్పుడూ సాఫ్ట్ టార్గెట్ అయిపోతారు ఇలాంటి విషయాల్లో. మార్ఫింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా.!
మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, జూనియర్ ఎన్టీయార్.. తదితరులే, కోర్టును ఆశ్రయించి ‘రక్షణ’ పొందాల్సి వచ్చిందంటే, పరిస్థితి ఎంత భయానకంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు.
మొన్నటికి మొన్న ‘ఓజీ’ సినిమాలో నటించిన ప్రియాంక మోహన్ మీద ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో, జుగుప్సాకరమైన ఫొటోలతో దాడి చేశారు కొందరు.

తాజాగా, శ్రీలీల అలానే నివేదా థామస్.. సోషల్ మీడియా వేదికగా బతిమాలుకున్నారు.. చేతులెత్తి దండం పెట్టారు.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు.
శ్రీలీల, బాత్రూమ్లో స్నానం చేస్తున్న ఫొటోలు.. నివేదా థామస్.. చీర కట్టులో జుగుప్సాకరంగా కనిపిస్తున్న ఫొటోలు.. ఇదీ లేటెస్ట్ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ పైత్యం.
ప్రాంప్ట్ ఇస్తే చాలు..
ముందే చెప్పుకున్నట్లు.. చిన్న ప్రాంప్ట్ ఇస్తే చాలు, ఏమైనా చేసేస్తున్నాయి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్.! కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయ్ యాప్స్.. వాటి పైశాచిక దాడి వేరే లెవల్లో వుందిప్పుడు.
ఇంట్లో తల్లిదండ్రుల ఫొటోల్ని కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో జుగుప్సాకరంగా మార్చే స్థాయికి పైశాచికత్వం పెరిగిపోయింది.
నిజమే, ఇంట్లో ఆడ పిల్లలకి కూడా రక్షణ లేని జుగుప్సాకరమైన ప్రపంచంలోకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, నేటి యువతని తీసుకెళ్ళిపోతోంది.
Also Read: అధరామృతం.. అవ్వకూడదు విషపూరితం.!
ఇందుకే, సోషల్ మీడియాపై నియంత్రణ అవసరం.! ఇంటర్నెట్ మీద కూడా ఆంక్షలు అత్యవసరం.!
అన్నిటికీ మించి, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ మీద ప్రభుత్వాలకి ఖచ్చితమైన నియంత్రణ వుండి తీరాలి. కానీ, పిల్లి మెడలో గంట కట్టేదెవరు.?
