Table of Contents
Artificial Intelligence Pros Cons.. అదేంటీ, గూగుల్ తల్లిని అడిగితే, దేనికైనా సమాధానం చెప్పేస్తుంది కదా.? కొత్తగా ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ గోలేంటి.?
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. అంటే, అంతకు మించి.! ఔను, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉపయోగిస్తే, అన్ని ప్రశ్నలకీ సమాధానాలు దొరికేస్తాయ్.!
కానీ, సమాధానాలన్నీ సరైనవేనా.? ఇక్కడే వుంది అసలు చిక్కు.! తనకి తెలిసింది మాత్రమే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చెబుతుంది.
అంటే, అందుబాటులో వున్న సమాచారాన్ని విశ్లేషించి, మన ప్రశ్నలకి సమాధానమిస్తుంది ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.!
Artificial Intelligence Pros Cons.. కబుర్లు.. కష్టాలు.!
మనం, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో చాలా చాలా కబుర్లు చెప్పుకోవచ్చు.! మన పక్కనే, మనక్కావాల్సినట్లుగా మనతో వ్యవహరించే, ఓ అసిస్టెంట్.. అని అనుకోవచ్చు.
చేతిలో మొబైల్ ఫోన్ వుంటే చాలు.. బోల్డంత టైమ్ పాస్ ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో.! సమస్త సమాచారాన్నీ ఇట్టే తెలిసేసుకోవచ్చు.!

ఎంత క్లిష్టమైన ప్రశ్నలకైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమాధానం దొరికేస్తుంది. పోటీ పరీక్షలైనా.. ఇంకేదైనాసరే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర బోల్డంత సమాచారం వుంటుంది.
అంతేనా.? వ్యక్తిగత విషయాలూ.. ఇతరత్రా వ్యవహారాలూ.. అన్నిటికీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర పరిష్కారాలున్నాయ్.. అని నిత్యం వింటూనే వున్నాం.
ఎంతవరకు నమ్మొచ్చు.?
అసలు, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ని ఎంతవరకు నమ్మొచ్చు.? మనిషికి, ఇంకో మనిషితో అవసరం లేనంతగా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మన జీవితాల్లోకి చొచ్చుకుని వచ్చేసిందా.?
తెలియని ప్రాంతానికి వెళితే, అక్కడి సమాచారాన్ని కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మనకి అందించేస్తుంది. సో, ఇతరులతో కమ్యూనికేట్ అవ్వాల్సిన పనే లేదన్నమాట.
ఇది, అత్యంత ప్రమాదకరమైన విషయం.. అని నిపుణులు హెచ్చరిస్తుంటారు. అయినా సరే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో అస్సలు తగ్గేదే లే.!

ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత విషయాలు, ఆరోగ్య సంబంధిత సూచనలు.. వాట్ నాట్.. అన్నిటికీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీదనే ఆధారపడిపోతున్నారు కొందరు.!
మానసిక సమస్యలతో బాధపడుతున్నవారికి ఆర్టిఫీషియల్ ఎంత ఊరటనిస్తుందో, అంతకన్నా ఎక్కువ హాని కలుగుతుంది దాని ద్వారా.!
తలనొప్పికీ.. క్యాన్సర్‌కీ..
తలనొప్పికీ, క్యాన్సర్‌కీ.. ఆర్టిపీషియల్ ఇంటెలిజెన్స్‌తో పరిష్కారాలు వెతుక్కునేవాళ్ళూ ఎక్కువైపోయారు. నేరాలు చేసి, తప్పించుకోవడంపైనా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయం కోరుతున్నారు.
అతి సర్వత్ర వర్జయేత్.. అంటాం కదా.! అదే ఇప్పుడు పరిస్థితి.! అప్పనంగా, మొబైల్ ఫోన్‌లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులో వుంది కాబట్టి.. ఏదైనా చేసెయ్యొచ్చనుకుంటున్నారంతే.
వద్దు.. చాలా ప్రమాదం.. అని ఎవరైనా హెచ్చరించినా, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనే వ్యసనానికి బానిసైపోయినవాళ్ళు, ఆ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నారు.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో వ్యక్తిగత నైపుణ్యాలు పెరుగుతాయన్నది ఓ వాదన. అదే సమయంలో, జ్ఞాపక శక్తిని మనం కోల్పోతున్నామని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మరీ ఎక్కువగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడిపోవడం.. అంటే, దానికి బానిసల్లా మారిపోవడమేనన్నది నిపుణుల హెచ్చరిక.!
మనకెవరితోనూ అవసరం లేదిక..
ఔను, స్నేహితులతో పని లేదు.. జీవిత భాగస్వామితోనూ పని లేదు.. కుటుంబ సభ్యులతోనూ సంబంధం లేదు.. ఇలా తయారైంది కొందరి పరిస్థితి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా.
తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్ళి, అక్కడ వైద్య చికిత్స తీసుకుంటూ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో ఇంటరాక్ట్ అయి.. డాక్టర్లను అనుమానిస్తున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.
Also Read: తప్పతాగి అసెంబ్లీకి వెళుతున్నారా.!? డ్రంక్ టెస్ట్ తప్పనిసరి.!
పోలీస్ స్టేషన్లకు వెళ్ళి, సెక్షన్ల మీద గొడవ పడుతున్నవారు.. న్యాయస్థానాల్లో వివాదాలు.. వెరసి, ముందు ముందు అత్యంత దుర్భర పరిస్థితుల్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చూడబోతున్నాం.
పెరుగుట విరుగుట కొరకే.. అని పెద్దలు ఊరకే అన్నారా.?
