Home » Raashi Khanna Lifestyle సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!

Raashi Khanna Lifestyle సమ్‌థింగ్ వెరీ స్పెషల్.!

by hellomudra
0 comments
Raashi Khanna Lifestyle

Raashi Khanna Lifestyle వెండితెరపై అందంగా కనిపిస్తూ, ముద్దుముద్దుగా సందడి చేసే ముద్దుగుమ్మల్లో మనకు తెలియని ఎన్నో టాలెంట్లు దాగి ఉంటాయ్. అవకాశం వచ్చినప్పుడే వాటి గురించి బయట పెట్టడానికి ఇష్టపడుతుంటారు అందాల భామలు.

అలా వారి ఇష్టా ఇష్టాలనూ, హాబీలను గురించి తెలుసుకుంటే, ఒక్కోసారి అవాక్కవ్వాల్సిందే. ఎందుకంటే, అంతలా అందాల భామలు తమలోని ప్రత్యేక ప్రతిభలను దాచేస్తుంటారు మరి. తెరపై కనిపించే అందానికి ధీటుగా వారిలో దాగున్న టాలెంట్స్ అదరహో అనిపిస్తుంటాయ్.

అందగత్తె మాత్రమే కాదు, పాటగత్తె కూడా..

‘ఊహలు గుసగుసలాగే’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. తొలి సినిమాతోనే కుర్రకారును తన వైపుకు తిప్పేసుకుంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకుంది.

Raashi Khanna
Raashi Khanna

అయితే, రాశి ఖన్నాలో కేవలం అందమేనా.? అంతకు మించిన టాలెంటుంది తెలుసా.? రాశి ఖన్నాయాక్ర్టెస్ మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా అనే విషయం అందరికీ తెలిసిందే. ‘జోరు’ సినిమా కోసం తన ఇంటర్నల్ సింగింగ్ టాలెంట్‌ని బయట పెట్టింది ఈ అందాల రాశి.

Raashi Khanna Lifestyle.. పుస్తకాల పురుగు రాశి ఖన్నా..

చిన్నతనం నుండీ స్టడీస్ అంటే చాలా ఇష్టమట రాశీకి. క్లాస్‌లో తనే టాపర్ అని చెబుతుంది. ఆ ఇష్టంతోనే ఏ బుక్ కనిపించినా అస్సలూరుకోదట వెంటనే చదివేయాల్సిందేనట. అందుకే రాశీకి పుస్తకాల పురుగు అనే నిక్ నేమ్ కూడా ఉందటండోయ్.

అలాగే, సంగీతం పట్ల కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటుంది రాశి ఖన్నా (Raashi Khanna). ఎలాగూ సింగింగ్ టాలెంట్ ఉండనే ఉంది. లాక్‌డౌన్ సమయాన్ని వేస్ట్ చేయకుండా, గిటార్ నేర్చుకుంది. సమయం దొరికినప్పుడల్లా గిటార్ ప్లే చేస్తుందట. గిటార్ ప్లే చేస్తూ పాట పాడుతుంటే.. వచ్చే ఆ కిక్కే వేరప్పా అంటోంది అందాల భామ రాశి.

Raashi Khanna
Raashi Khanna

ఫిట్ అండ్ పెర్‌ఫెక్ట్

మొదట్లో రాశి ఖన్నా కాస్త బొద్దుగా కనిపించేది. కానీ, అనూహ్యంగా బరువు తగ్గి.. స్లిమ్ అండ్ ఫిట్‌గా కనిపిస్తోంది. సీక్రెట్ ఏంటని ప్రశ్నిస్తే, క్రమం తప్పకుండా చేసే వర్కవుట్స్.. అని సమాధానమిస్తోంది ఈ బ్యూటీ.

Also Read: Payal Rajput ఇంటరెస్టింగ్ ఫిలాసఫీ ఇదీ.!

శరీరానికి అవసరమైనంత అలాగే మనసుకి నచ్చినంత తినడం ద్వారా ఆరోగ్యంగా వుండొచ్చనీ, ఆరోగ్యంగా వుంటే, అందం దానంతట అదే వస్తుందనీ రాశి ఖన్నా (Raashi Khanna Lifestyle) చెబుతుంటుంది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group