Aryan Khan Mister Clean.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్, డ్రగ్స్ కేసులో కొన్నాళ్ళ క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే.
‘పండిత పుత్ర పరమ శుంఠ..’ అంటూ ఆర్యన్ ఖాన్ మీద అప్పట్లో కుప్పలు తెప్పలుగా కథనాల్ని వడ్డించింది మీడియా ఆర్యన్ ఖాన్ అరెస్టు వ్యవహారంపై.
నేషనల్ మీడియా, లోకల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా, వెబ్ మీడియా.. ఇలా అన్ని చోట్లా అదే చర్చ.. అదే రచ్చ.!
తన కుమారుడికి బెయిల్ ఇప్పించేందుకోసం ఏకంగా ఓ అడ్వొకేట్స్ టీమ్‌ని షారుక్ ఖాన్ ఏర్పాటు చేసి, చాలా చాలా సొమ్ములు వెచ్చించాడు. ఎలాగైతేనేం బెయిల్ వచ్చింది.! ఆర్యన్ ఖాన్ బెయిల్‌పై విడుదలయ్యాడు.
అలా ఎలా జరిగింది చెప్మా.?
చిన్న కేసు కాదిది.! ఆర్యన్ ఖాన్ (Aryan Khan) బయటకు రావడం కష్టం. జైలుకే పరిమితమైపోవాలేమో.! ఇలాంటి అభిప్రాయాలు నిపుణుల నుంచీ వ్యక్తమయ్యాయి.
కానీ, గొప్పోళ్ళ వారసులకు ఇలాంటి కేసులు చాలా చాలా చిన్నవి. అప్పటికప్పుడు మీడియా చేసే హడావిడి తప్ప, ఎన్ని కేసుల్లో ప్రముఖులు, వారి వారసులు తప్పించుకోలేదు.?
బాలీవుడ్ నటి రియా చక్రవర్తి విషయానికొస్తే, ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుట్ మరణానికి ఆమె కారణమయ్యిందన్నారు. డ్రగ్స్‌తో ఆమెకు లింకులున్నాయన్నారు. చివరికి ఏమయ్యింది.?
Aryan Khan Mister Clean ఎంత మంచివాడవురా.!
ఆర్యన్ ఖాన్ విషయంలో తాజాగా ‘క్లీన్ చిట్’ లభించింది నార్కోటిక్స్ బ్యూరో నుంచి. ఆర్యన్ ఖాన్ వద్ద డ్రగ్స్ లభించాయనడానికి సరైన సాక్ష్యాధారాలే దొరకలేదట. అలాగని చార్జిషీట్‌లో పేర్కొన్నారు.

ఇంకేముంది.? ఆర్యన్ ఖాన్ కడిగిన ముత్యంలా బయటకు వచ్చేశాడు. ఇదీ మన దేశంలో వ్యవస్థలు భ్రష్టుపట్టిపోయిన వైనం.
హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్‌కి వ్యతిరేకంగా ఆధారాల్లేవ్.! డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కి వ్యతిరేకంగా ఆధారాలు దొరకలేదు.! సేమ్ టు సేమ్ కదూ.!? ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా.!
Also Read: దిశ ఎన్‌కౌంటర్.! ఏది బూటకం.? ఏది న్యాయం.?
ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ బానిస కాదు.! ఆర్యన్ ఖాన్ ఉత్తమ పురుష.! ఇదీ ఇప్పుడు జనం మాట్లాడుకోవాల్సింది. ఎంతైనా షారుక్ ఖాన్ (Shahrukh Khan) తనయుడు కదా.! చట్టం తన పని కాకుండా, వేరే పని చేసిందిప్పుడు షరామామూలుగానే.!