Ashika Ranganath Amigos Beauty ఎన్నో రాత్రులొస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మా.!’ అంటూ ఈ మధ్య ఓ పాటలో హాట్ హాట్‌గా స్టెప్పులేసిన ముద్దుగుమ్మ గుర్తుంది కదా.! పేరు ఆషికా రంగనాధ్. సినిమా ‘అమిగోస్’.
బాబాయ్ బాలయ్య రెట్రో సాంగ్‌ని తన తాజా సినిమా ‘అమిగోస్’ కోసం కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) రీమిక్స్ చేసుకున్నాడు. ఈ పాటలోనే అందాల కన్నడ కుట్టీ ఆషికా రంగనాధ్, కళ్యాణ్ రామ్‌తో ఆడి పాడింది.
ఇటీవలే ప్రేక్షకుల ముందుకు దూసుకొచ్చిన ఈ సినిమా అంతే వేగంతో బాక్సాఫీస్ వద్ద కుదేలైంది. అయితే, సినిమా ఫెయిలైనా, ఈ పాట.. పాటలో ఆడి పాడిన అందగత్తె ఆషికా రంగనాధ్ బాగా పాపులరైంది.
సినిమా హిట్ అయ్యుంటే వేరే లెవల్లో వుండేదేమో అమ్మడి అదృష్టం. కానీ అలా జరగలేదు. పాటతోనే సరిపెట్టుకోవల్సి వచ్చింది.
ఎంతో కొంత అలా దక్కించుకున్న పాపులారిటీని నెక్స్‌ట్ లెవల్‌కి తీసుకెళ్లాలనుకుంటోంది ముద్దుగుమ్మ ఆషికా రంగనాధ్ (Ashika Ranganath).
Ashika Ranganath Amigos Beauty.. ‘అమిగోస్’ భామ సో హాట్ సుమా.!
అందులో భాగంగానే సోషల్ మీడియా హ్యండిల్‌ని బా.. గా.. వాడేస్తోంది. హాట్ హాట్ ఫోటోలతో ఆషికా రంగనాథ్ (Ashika Ranganath) నెట్టింటిని హీటెక్కిస్తోంది.

తనదైన గ్లామర్ పోజులతో కుర్రోళ్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఒక్క ఛాన్స్.. ఇంకొక్క ఛాన్స్ ఇస్తే తెరపై మళ్లీ తన అందాల హవా ఏంటో చూపిస్తానంటోంది.
Also Read: సెటైర్: ప్రభాస్‌కి జ్వరం రావడమేంటి అధ్యక్షా.?
అందాకా, సోషల్ మీడియాలో ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోనంటోంది ఈ అందాల భామ.
తాజాగా రెడ్ కలర్ అవుట్ ఫిట్‌లో నెటిజన్లు ఫిదా అయ్యేంతలా తన ఘాటైన అందాలతో దాడికి యత్నించింది కన్నడ కస్తూరి ఆషికా రంగనాధ్ (Ashika Ranganath).
ఈ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయ్. అవ్వకుండా వుంటాయా.? ఆ స్థాయిలో హాట్ అప్పీల్ పండించేస్తోంది మరి.! రెడ్ హాట్ అంటే ఇదే.!