ప్రపంచం మెచ్చిన యోగా.. మనదేగా.!

419 0

యోగా (Yoga).. అబ్బో ఇదేదో ముద్దుగుమ్మలు స్కిన్‌ షో చేసేందుకు ఉపయోగించే మాట అనుకుని ఇన్నాళ్లూ పక్కన పెట్టేశాం. అవును నిజమే, చూడ చక్కని అందాల భామలు యోగా (Yoga Health Benefits) పేరు చెప్పి, తమ శరీరాన్ని విల్లులా వంచి, వయ్యారాలు పోతుంటారు.

ఆ వంపులకు పురుష పుంగవులు ఆహా ఏమా భంగిమా.. అంటూ పులకించి పోతుంటారు. ‘భంచిక్‌ భం భం చెయ్‌ బాగా.. ఒంటికి యోగా మంచిదేగా.. అని పాటేస్కుని ఓ హీరోయిన్‌ అప్పుడెప్పుడో చెప్పేసింది యోగా ముద్దు ముచ్చట.

అయితే, అప్పుడంతగా ఎక్కలేదు. కానీ, ఇప్పుడు సోషల్‌ మీడియా పుణ్యమా అనాలో, పబ్లిసిటీ పిచ్చే అనాలో, లేక నిజంగానే దాని అవసరం అనింపించిందో ఏమో కానీ, యోగాపై రావల్సినంత అవగాహన రానే వచ్చిందిలెండి. సెలబ్రిటీలు, సామాన్యులు, రాజు, పేద, చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా యోగాపై కసరత్తులు మొదలెట్టేశారు.

నిజానికి యోగా అనేది ఇప్పుడు కొత్తగా పుట్టిందేం కాదు. భారతీయ సంస్కతిలో ఓ భాగం. చాలామంది భావిస్తున్నట్లు శరీరాకృతికి సంబంధించిన విషయం మాత్రమే కాదు యోగా. అది జీవన విధానం. వేలాది సంవత్సరాలుగా మానవ జీవనంలో భాగం.

యోగా అంటే మతానికి సంబంధించినది కాదు.. Yoga Health Benefits

కొన్నాళ్ల క్రితం వరకూ యోగా కేవలం హిందూ మతానికి సంబంధించింది అనే అపోహ ఉండేది. కానీ ఇప్పుడలాంటి అపోహలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలూ యోగా పట్ల ఆశక్తి చూపుతున్నాయి.

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ప్రతీ ఒక్కరి జీవితంలోనూ యోగా ఓ భాగం కావాలనే నినాదం గత కొన్నేళ్లుగా లోతుగా నాటుకుంది. గత నాలుగేళ్లుగా ఈ యోగా మూమెంట్‌ బలంగా స్టార్ట్‌ అయ్యిందని చెప్పొచ్చు.

సర్వరోగాలకూ ఒకటే మూలం (Yoga Health Benefits). ఊబకాయం. ఈ ఊబకాయ సమస్యని ఎదుర్కోవాలంటే తప్పదు మన ముందున్న పర్మినెంట్‌ ఛాయిస్‌ యోగా. ఊబకాయయే కాదు, మానసిక ఒత్తిడితో సహా పలు రకాల సమస్యలకు యోగాతో నివారణా మార్గాల్ని అన్వేషించొచ్చు.

అందుకే ఇప్పుడిప్పుడే యోగాపై చాలా మందికి అవగాహన ఏర్పడుతోంది. ప్రభుత్వాలతో పాటు, పలు రకాల ప్రైవేట్‌ సంస్థలు యోగాపై ఆయా చోట్ల అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.

ఇప్పుడిది ప్రపంచ యోగం.. Yoga Health Benefits

రాబోయే ముప్పుని ముందుగానే గ్రహించి, యోగా ప్రాధాన్యతను వివరిస్తూ, అవగాహన పెంచే దిశగా మన భారత దేశం ఎప్పటినుండో మొత్తుకుంటోంది. కానీ, ప్రపంచ దేశాలూ వినలేదు. ముఖ్యంగా ఇస్లామిక్‌ దేశాలు యోగాకి వ్యతిరేకంగా పావులు కదిపాయి.

కానీ, అనూహ్యంగా ముంచుకొచ్చిన ఊబకాయ సమస్యే యోగా వైపు ప్రపంచ దేశాల్ని దృష్టి పెట్టేలా చేశాయి. ఇప్పుడు ఇండియాని మించిన విధంగా ప్రపంచ దేశాలు యోగా జపం చేస్తున్నాయంటే, సమస్య ఎంత తీవ్రతరమైందో అర్ధం చేసుకోవచ్చు.

ఈ సాంకేతిక యుగంలో.. యోగా కోసం కూడా తగినంత సమయాన్ని కేటాయించాల్సిందేనని ప్రపంచ దేశాలు నొక్కి వక్కాణిస్తున్నాయి. మనిషి జీవితంలో యోగా ఖచ్చితంగా ఓ భాగమై వుండాలని ప్రపంచ స్థాయి వైద్యులు సూచిస్తున్నారు. దాంతో యోగా పట్ల అవగాహన రోజురోజుకీ పెరుగుతోంది.

యోగా అంటే అది జీవన విధానమన్న భావన, యోగా ద్వారా కలుగుతున్న ఆరోగ్య ప్రయోజనాలు.. ఇవన్నీ యోగాకి ిఇటీవలి కాలంలో విపరీతమైన క్రేజ్ కలిగేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

యోగాలో ఎన్నెన్ని వింతలో..

యోగా అంటే కష్టమైన ఆసనాలు మాత్రమే కాదు, రకరకాల సులభతరమైన ఆసనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు శృంగార యోగాని తీసుకుందాం. యోగాలా కాకుండా, భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని పెంచేందుకు ఈ యోగా ఉపయోగపడుతుంది.

చూడ్డానికి కామసూత్రలా అనిపించినా, భార్యా భర్తల మధ్య నెగిటివ్‌ వైబ్రేషన్స్‌ని తొలగించి, పోజిటివ్‌ వైబ్రేషన్స్‌ని క్రియేట్‌ చేస్తుంది. దీన్నే కపుల్‌ యోగా అని కూడా సంబోధిస్తుంటారు. సోలోగా కాకుండా, కపుల్స్‌ కలిసి చేసే సరదా సరదా వర్కవుట్లు ఈ యోగాలో పొందుపరిచారు.

అలాగే జల యోగా, ఏరియల్‌ యోగా.. అంటూ రకరకాల పేర్లతో యోగాలో ఎన్నో రకాలు పుట్టుకొచ్చాయి. ఒక్కో రకం విన్యాసానికి ఒక్కో పేరు పెట్టేసుకున్నారు. అలా ఒకటా, రెండా.. వందలాది పేర్లున్నాయి ఈ యోగా విన్యాసాలకు. పేరేదైతేనేం, పరమార్ధం మాత్రం ఒక్కటే. స్వచ్చమైన ఆరోగ్యం. హా..! ఆరోగ్యమే మహాభాగ్యం కదా.

యోగాని ప్రమోట్‌ చేయడంలో అందాల భామలు అందరి కంటే ముందుంటున్నారు. స్పెషల్‌గా వీడియోలు రూపొందించి, అభిమానుల్లో అవగాహన పెంచడంతో పాటు, తమకి కావల్సిన బోలెడంత క్రేజ్‌ కూడా సంపాదించుకుంటున్నారు.

ఓ వైపు తమ సోయగాలకు పిచ్చ పాపులారిటీ. దాంతోపాటే పోటెత్తే అవకాశాలు ఐడియా అదిరింది కదూ.! అందుకేనేమో, అందాల భామలు తమ శరీరాన్ని కాస్త కష్టబెట్టి అయినా.. అతి క్లిష్టమైన యోగాసనాల్ని సులువుగా వేసేందుకు నానా తంటాలూ పడుతున్నారు.

హెల్త్‌ బెనిఫిట్స్‌..

యోగా (Yoga Health Benefits) కారణంగా విపరీతమైన ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. తద్వారా దీర్ఘ కాల వ్యాధులైన బీపీ హ్రైపర్‌ టెన్షన్‌), షుగర్‌ (డయాబెటిస్‌) వంటివి కంట్రోల్‌లో ఉంటాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ యోగాతో పుట్టుకొస్తాయి. అవి అనేక రుగ్మతల నుంచి మనల్ని దూరంగా వుంచుతాయి.

యోగా అంటే కేవలం ఆసనాలు మాత్రమే కాదండోయ్‌. మనల్ని మనం కంట్రోల్‌ చేసుకోవడం. శరీరాన్నీ, మనసునీ ఒకేసారి బ్యాలెన్స్‌ చేయడం.. ఎలాంటి అంశంపట్లయినా ఏకాగ్రత కలిగేలా వ్యవహరించగలగడం.. వంటి ఎన్నో రకాల మీనింగ్స్‌ని యోగాకి ఆపాదించొచ్చు.

అన్ని రకాల వయసుల వారూ తేలికగా పాఠించే ఆసనాలు యోగాలో ఉన్నాయి. మంచి యోగా గురువుని ఎంచుకోవడమే కాదు, వైద్య సలహా తీసుకుని యోగాసనాలు ప్రారంభించడం మంచిది. ఎందుకంటే, అందరికీ అన్ని యోగాసనాలూ సరిపడవు. ఏ ఆసనం వేసినా ఏకాగ్రత అనేది కీలకం. అది లేకుండా ఎంత చేసినా, ఏం చేసినా దండగే అవుతుంది.

Related Post

సాహోరే ఇస్రో: జాబిల్లిపై మన సంతకం.!

Posted by - July 22, 2019 0
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO), అంతరిక్ష ప్రయోగాల్లో తనదైన ముద్రను ఏనాడో వేసింది. చంద్రుడి మీద మనిషి ఎప్పుడో యాభయ్యేళ్ళ క్రితమే అడుగు పెట్టినా,…

మెన్ ఇన్ బ్లూ.. ఈ దాహం తీరనిది.!

Posted by - July 8, 2019 0
ఈసారి వరల్డ్‌ కప్‌ పోటీల్లో టీమిండియా (Team India World Cup 2019 Winner) బ్యాటింగ్‌ సెన్సేషన్‌ ఎవరంటే, తడుముకోకుండా వచ్చే సమాధానం రోహిత్‌ శర్మ అనే.…

‘యతి’ అసలేంటి సంగతి.?

Posted by - April 30, 2019 0
ఆంజనేయుడు చిరంజీవి. ఆయనే హిమాలయాల్లో (Yeti Snow Man Himalayas) ఇప్పటికీ తిరుగుతుంటాడనీ, ఓ బలమైన నమ్మకం. ఆంజనేయుడి అంశే జాంబవంతుడనీ, ఆ జాంబవంతుడే ‘యతి’ రూపంలో…
Ram Charan, Pooja Hegde, NTR, Rakul Preet Singh, Fitness, Six Pack

సిక్స్‌ ప్యాక్‌ రౌడీస్‌ అండ్‌ లేడీస్‌.!

Posted by - September 17, 2018 0
ఇప్పుడు సిక్స్‌ ప్యాక్‌ బాడీ (Six Pack Fitness) అంటే ఎంత ట్రెండింగో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ట్రెండ్‌ని అచ్చంగా ఫాలో అయిపోయే కుర్రకారు ఈ సిక్స్‌బాడీ వైపు…

భారత్‌ వర్సెస్‌ పాక్‌: క్రికెట్‌ కాదది యుద్ధం.!

Posted by - June 15, 2019 0
టీమ్‌ ఇండియా (Team India) ఎప్పుడు, ఎక్కడ పాకిస్థాన్‌తో (Pakistan)  తలపడినా (India Vs Pakistan World Cup 2019), అక్కడ పరిస్థితులు యుద్ద వాతావరణాన్ని తలపిస్తాయి.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *