Ashu Reddy Ariyana Glory అషూ రెడ్డి, అరియానా గ్లోరీ.. ఇద్దరూ బిగ్‌బాస్ సెలబ్రిటీలే. వేర్వేరు సీజన్లలో కంటెస్టెంట్లు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు. బిగ్‌బాస్ షో ఎవరికి ఎంత ఉపయోగపడిందన్న సంగతి పక్కన పెడితే, ఈ ఇద్దరికీ బాగానే యూజ్ అయ్యిందనాలేమో.
అంతకు ముందు సోషల్ మీడియాలో ప్రభంజనం అషూ రెడ్డి (Ashu Reddy). అయితే, బిగ్‌బాస్ తర్వాత మరింత క్రేజ్ దక్కించుకుంది. ఆ క్రేజ్‌ని అలా కంటిన్యూ చేస్తూనే వుంది. అషూ రెడ్డి (Ashu Reddy) అంటే ఇప్పుడో పెద్ద సెలబ్రిటీ మరి.
ఇక అరియానా (Ariyana glory) విషయానికి వస్తే, యాంకర్‌గా స్టార్ట్ చేసిన కెరీర్, బిగ్‌బాస్ పుణ్యమా అని ఓ మోస్తరు క్రేజ్‌తో బాగానే క్లిక్ అవుతోందనుకోండి..
Ashu Reddy Ariyana Glory.. భావ వ్యక్తీకరణ: ఈ చుంబనాల గోలేంట్రా బాబూ.!
ఇక అసలు విషయానికొస్తే, అరియానా (Ariyana glory) నడుమును అషూ (Ashu Reddy) ముద్దాడుతున్నట్లుగా వున్న ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్. సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోందీ పిక్. ‘అనంతమైన భావ వ్యక్తీకరణ.. ద్వేషించే వాళ్లు ద్వేషించండి.. మేం మాత్రం ప్రేమించుకుంటూనే వుంటాం..’ అంటూ ఓ దిక్కుమాలిన క్యాప్షన్ ఒకటి పెట్టి ఈ పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అషూ రెడ్డి.

ఇక అంతే.. నెటిజన్లు ఊరుకుంటారా.? ఇదేం భావ వ్యక్తీకరణే తల్లీ.. ఈ ఛండాలం చూడలేకపోతున్నాం.. అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఇలాంటి ఫోటోలూ క్యాప్షన్లు పెట్టడం.. మాది భావ వ్యక్తీకరణ అనడం.. పెట్టిన వాళ్లకు వున్న ఆ దిక్కుమాలిన ‘భావ వ్యక్తీకరణ’ చూసే వాళ్లకు వుండకూడదా.?
రెస్పాండ్ అయితే అదో రచ్చ. ఫ్రీ పబ్లిసిటీ కోసం వీళ్లు వేసే వెర్రి వేషాలకు.. రెస్పాన్స్ అదే రేంజ్‌లో వస్తే, అక్కడికేదో నెటిజన్లు చేయరాని, చేయకూడని తప్పుచేసేశారన్నట్లు చిత్రీకరిస్తారు.
అదలా వుంటే, ‘ఒసేయ్ అషూ.! నీకూ, నీ క్రేజీనెస్‌కీ ఓ దండం తల్లీ.. పాపం అందరూ తప్పుగా అనుకుంటారే.. జడ్జిమెంటల్ అవుతున్నామే..’ అంటూ అషూ రెడ్డి (Ashu) పోస్ట్‌కి అరియానా (Ariyana) రెస్పాండ్ అయ్యింది.
మీ బుద్ధే వంకర బుద్ది.. ఊ అంటారా ఊ ఊ అంటారా.!
వాస్తవానికి ఈ ఫోటోలోనూ తప్పేం లేదనుకోండి. సినిమాల్లోనూ, వెబ్ సిరీస్‌లలోనూ ఈ తరహా కంటెంట్ బాగానే చూసేస్తున్నాం. సో అలా చూస్తే, ఈ పిక్‌లో పెద్దగా కనిపించే తప్పేం లేదు. ఎవరి భావ వ్యక్తీకరణ వాళ్లది.
Also Read: దీపికా పదుకొనె ముద్దు ముచ్చట: ఎవరైనా ఎప్పుడైనా.!
లోకం మారింది గురూ. అమ్మాయిని మాత్రమే అబ్బాయి ప్రేమించాలనీ, అమ్మాయిలు అబ్బాయిలని మాత్రమే ఆరాధించాలనే సిద్ధాంతాలు అటకెక్కాయ్. వెరైటీగా అమ్మాయిల్ని అమ్మాయిలు.. అబ్బాయిల్నిఅబ్బాయిలు ఆరాధిస్తూ, ప్రేమిస్తూ.. ఇంకేదేదో చేసేస్తూ.. నయా ట్రెండ్‌కి శ్రీకారం చుట్టేశారు.
ఇద్దరబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఇద్దరమ్మాయిలూ పెళ్లి చేసుకుంటున్నారు. దాన్ని తప్పు పట్టలేని సమాజంలో మనమున్నాం. అదేదో ఘనకార్యంలా ప్రచారం చేసుకుంటున్న ట్రెండులో కొనసాగుతున్నాం.. అలాంటిది, ఏదో పబ్లిసిటీ కోసం అరియానా నడుముపై అషూ ఛుంబనం (Ashu Ariyana) చేస్తే.. ఎందుకింత రాద్దాంతమంట.? చూసే వాళ్లదే వంకర బుద్ది.. అంటే, తప్పేంటట?