Home » దీపికా పదుకొనె ముద్దు ముచ్చట: ఎవరైనా ఎప్పుడైనా.!

దీపికా పదుకొనె ముద్దు ముచ్చట: ఎవరైనా ఎప్పుడైనా.!

by hellomudra
0 comments
Deepika Padukone

Deepika Padukone Lip Lock.. అప్పుడెప్పుడో చాన్నాళ్ల క్రితం బాలీవుడ్ నటి కరీష్మా కపూర్ చేసిన ఆన్ స్ర్కీన్ లిప్ లాక్ సన్నివేశం దగ్గర్నుంచీ, ఇప్పటిదాకా రొమాంటిక్ సన్నివేశం ట్రెండ్‌లో చాలా చాలా మార్పులొచ్చాయ్. ఇద్దరు హీరోయిన్ల మధ్య లిప్‌లాక్ సన్నివేశాల్నీ, ఇద్దరు హీరోల మధ్య గాఢమైన ఛుంబన దృశ్యాల్నీ చూశాం.. చూస్తూనే వున్నాం.

ఇదొక సర్వ సాధారణమైన ట్రెండ్ అయిపోయింది. ఏదో ఒక ప్రత్యేకత వుంటే తప్ప తమ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి వీలుండట్లేదు కాబట్టి, ఆ ప్రత్యేకత కోసం ప్రతిసారీ ఈ ‘ముద్దు’ చుట్టూనే ఫిలిం మేకర్స్ రకరకాల ప్రయోగాలు చేస్త్తున్నారు.

Deepika Padukone Lip Lock ముద్దు ముచ్చట

అసలు విషయానికి వస్తే, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె (Deepika Padukone) తన తాజా చిత్రం ‘గెహరాఇయాన్’ (Gehraiyaan) ప్రమోషన్లలో ముద్దు ముచ్చట్లు ఒకింత ఆసక్తికరంగా చెప్పింది.

ఇంటిమేట్ సీన్లలో నటించడం ఇబ్బందికరంగా అనిపించలేదా.? అని దీపికని కొందరు ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు దీపిక ముందుకు ఎందుకొచ్చిందంటే, కొన్నాళ్ల క్రితమే ఆమెకు పెళ్లయ్యింది.

Deepika Padukone
Deepika Padukone

పెళ్లయ్యాకా ఇదేం పైత్యం.? అన్నది ఆ ప్రశ్నతాలూకు అసలు అర్ధం. ఆ ప్రశ్న లోతు ఎంతో బాగా తెలిసిన దీపిక కాస్త తెలివిగా సమాధానమిచ్చింది.

‘చెప్పాలనుకున్న కథకు ఎలాంటి సన్నివేశాలు అవసరమో, దర్శకుడు నిర్ణయిస్తాడనీ, ఆ కథ విపరీతంగా ఆకట్టుకుంటే తప్ప.. అలాంటి సన్నివేశాల్లో ఊరికినే నటించేసి, చెడ్డపేరు తెచ్చుకోవాలని ఎవరూ అనుకోరు..’ అని దీపికా పదుకొనె సమాధానమిచ్చింది.

లిప్ లాక్.. ఎప్పుడు.. ఎవరితో.. ఎలా.?

ఎవర్ని ముద్దు పెట్టుకోవాలి.. ఎందుకు ముద్దు పెట్టుకోవాలి.? అన్న విషయాలపై ఆన్ స్ర్కీన్ రొమాన్స్ పరంగా పెద్దగా చర్చ అనవసరం అనేసింది దీపికా పదుకొనె. తెరపై రెండు పాత్రల మధ్య రొమాన్స్ తప్ప, ఇద్దరు వ్యక్తుల మధ్య రొమాన్స్ జరగదని దీపిక వివరంగా సెలవిచ్చింది.

Also Read: అయ్యయ్యో వద్దమ్మా.! జాక్వెలైన్ గోలేంటమ్మా.?

సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఎంత ప్రొఫిషనల్‌గా నటించాలి..? అన్న విషయం మీద నటీనటులకీ, దర్శకులకీ, సినిమా టెక్నీషియన్లందరికీ ఒక అవగాహన వుంటుందని దీపిక (Deepika Padukone) పెద్ద లెక్చరే ఇచ్చింది.

You may also like

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group