Table of Contents
తెలుగు తెరపైకి మరో అవంతిక.! ఈ అవంతిక (Avantika Dassani) బాలీవుడ్ నుంచి దిగుతోంది.. ఓ ప్రముఖ నటి కుమార్తె కూడా.!
బాలీవుడ్ నటి భాగ్యశ్రీ గుర్తుందా.? అదేనండీ, సల్మాన్ ఖాన్ నటించిన ‘మైనే ప్యార్ కియా’ సినిమాలో హీరోయిన్.! అప్పట్లో తెలుగులోనూ ఆ సినిమా ‘ప్రేమ పావురాలు’ పేరుతో విడుదలై సంచలన విజయాన్ని అందుకుంది.
అయితే, వెండితెరపై భాగ్యశ్రీ ఎక్కువ సినిమాలేమీ చేయలేదు. మొన్నీమధ్యనే తెలుగులో ‘రాధేశ్యామ్’ సినిమాలో కనిపించింది భాగ్యశ్రీ.!
ఆ భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దస్సాని కూడా ఇప్పుడు నటిగా తెలుగు తెరపైకి ఎంట్రీ ఇవ్వబోతోంది.!
Avantika Dassani.. వెబ్ సిరీస్‌తో దుమ్ము రేపింది..
అవంతిక దస్సానీ హిందీలో ‘మిధ్య’ పేరుతో రూపొందిన వెబ్ సిరీస్‌లో బోల్డ్ అండ్ డైనమిక్ రోల్ చేసింది. నిజానికి, నెగెటివ్ షేడ్స్ వున్న రోల్ అది.!

కానీ, చాలా ఈజ్‌తో ఆ రోల్ చేసేసింది ‘మిధ్య’ వెబ్ సిరీస్‌లో అవంతిక. ఇలా ఎలా.? అని అంతా ఆవ్చర్యపోయారు. తల్లికి తగ్గ తనయ మాత్రమే కాదు.. తల్లిని మించిన తనయ.. అని అంతా ఆమెను ప్రశంసల్లో ముంచెత్తేశారు.
టాలీవుడ్ వైపు చూస్తోన్న బాలీవుడ్ భామలు..
తెలుగు తెరపైకి బాలీవుడ్ భామల ఫోకస్ ఈ మధ్య ఎక్కువగానే కనిపిస్తోంది. శ్రద్ధా కపూర్, అనన్య పాండే.. ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా చాలా పెద్దదే.
శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఎందుకో ఒకింత మొహమాటపడుతోంది తెలుగు సినిమాల్లో నటించడానికి. అవంతిక మాత్రం, రైట్ టైమ్‌లో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇస్తోంది.
పవర్ హౌస్ అంతే..
నటనలో తల్లి దగ్గరే అవంతిక ఓనమాలు నేర్చుకుందిట. ‘మైనే ప్యార్ కియా’ తన ఫేవరెట్ మూవీ అనీ, ఆ సినిమా చూసే నటన మీద ఆసక్తి పెంచుకున్నాననీ చెబుతోంది అవంతిక.
Also Read: Anasuya Bharadwaj ‘నవస్త్ర’.. అసలు అర్థం తెలుసా.!
అన్నట్టు, గ్లామర్ విషయంలో పెద్దగా మొహమాటాలేవీ లేవట అవంతికకి. ఆ విషయం తొలి వెబ్ సిరీస్ ‘మిధ్య’తో చెప్పకనే చెప్పేసింది భాగ్యశ్రీ తనయ.