హైపర్ ఆది కథ.! ‘చిన్న పెగ్గు – పెద్ద పెగ్గు’.!

 హైపర్ ఆది కథ.! ‘చిన్న పెగ్గు – పెద్ద పెగ్గు’.!

Hyper Aadi RGV Bholaa Shankar

Hyper Aadi RGV.. ‘భోళా శంకర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సెంటరాఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది హైపర్ ఆది స్పీచ్.!

మెగాస్టార్ చిరంజీవి గురించి గొప్పగా చెబుతూనే, పవన్ కళ్యాణ్ ప్రస్తావననీ తీసుకొచ్చాడు హైపర్ ఆది. అంతే కాదు, నాగబాబు తక్కువేం కాదనీ, నాగబాబు (Nagababu) సైతం చాలా గొప్ప వ్యక్తి అన్నాడు హైపర్ ఆది.

ఈ క్రమంలో కొందరి మీద పరోక్షంగా హైపర్ ఆది (Hyper Aadi) తనదైన స్టయిల్లో సెటైరికల్ డైలాగులు పేల్చాడు.

Hyper Aadi RGV.. పెగ్గు మీద పెగ్గు..

చిన్న పెగ్గు వేసి చిరంజీవిని.. పెద్ద పెగ్గు వేసి పవన్ కళ్యాణ్‌ని విమర్శిస్తుంటాడో దర్శకుడు. ఆయన గురించి మాట్లాడే స్థాయి నాకుందో లేదోగానీ.. అంటూనే, హైపర్ ఆది చెప్పాలనుకున్నది చెప్పేశాడు.

RGV Ram Gopal Varma
RGV Ram Gopal Varma

ఇంతకీ, ఎవరా దర్శకుడు.? సినీ పరిశ్రమలో ‘పెగ్గు’ అనగానే, ముందుగా గుర్తుకొచ్చే దర్శకుడి పేరు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma).!

చిరంజీవినైనా, పవన్ కళ్యాణ్‌ని (Pawan Kalyan) అయినా అకారణంగా తిడుతూ పైశాచికానందం పొందుతుంటాడు రామ్ గోపాల్ వర్మ.. అన్నది అందరికీ తెలిసిన విషయమే.

వర్మ తీరు మారలేదు..

ఇదిలా వుంటే, సోషల్ మీడియా వేదికగా వర్మ ఓ ఫొటో షేర్ చేశాడు. ఇదీ రామ్ గోపాల్ వర్మ అంటే.! ఆయనంతే, మారడు.. దిగజారడంలో కొత్త లోతుల్ని వెతుక్కుంటూనే వుంటాడు.

ఇంతకీ, పవన్ కళ్యాణ్ మీద సెటైర్లు వేస్తేనో.. చిరంజీవి (Mega Star Chiranjeevi) మీద సెటైర్లు వేస్తేనో వర్మకి ఏమొస్తుంది.? చిన్న పెగ్గు, పెద్ద పెగ్గు.. దొరుకుతుందంతే.!

అదొక పైశాచిక ఆనందం.!

Digiqole Ad

Related post