Avantika Vandanapu Champion అవంతిక వందనపు.. అంటే, చాలామందికి తెలియకపోవచ్చు. కానీ, అమెరికన్ బ్యూటీ అవంతిక.. అంటే, టక్కున గుర్తుకొచ్చేస్తుంది.!
అప్పుడెప్పుడో ‘బ్రహ్మోత్సవం’ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది అవంతిక వందనపు. అదీ, బాల నటిగా.! కానీ, పలు ఇంగ్లీష్ సినిమాలతో, పాపులర్ అయ్యింది.
తెలుగమ్మాయే.. కానీ, అమెరికాలో స్థిరపడింది. అక్కడే విద్యాభ్యాసం.. దాంతో, సహజంగానే ఇంగ్లీష్ యాక్సెంట్ డిఫరెంట్‌గా వుంటుంది అవంతికది.
దురదృష్టవశాత్తూ అవంతిక వందనపు ఇంగ్లీష్ యాక్సెంట్‌పై మన తెలుగు నెటిజనం దారుణమైన రీతిలో ట్రోలింగ్ చేస్తూ వచ్చారు.
ట్రోలింగ్‌ని పట్టించుకోకుండా తన పని తాను చేసుకు పోతోంది అవంతిక వందనపు.! తాజాగా, ఈ బ్యూటీ ‘ఛాంపియన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
సీనియర్ నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఛాంపియన్’. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది అవంతిక వందనపు.
స్పెషల్ సాంగ్ అనండీ, ఐటమ్ సాంగ్ అనండీ.. అవంతిక తనదైన స్టయిల్లో ఐటమ్ బాంబులా పేలనుందట ఈ పాటలో.. డాన్స్ చాలా బాగా చేసిందంటూ సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పదహారణాల తెలుగమ్మాయ్లానే మాట్లాడుతూ, ‘చాంపియన్’ సినిమా గురించి అవంతిక వందనపు ప్రమోషన్స్ చేస్తుండడం గమనార్హం.!
అయినా, పదహారణాల తెలుగమ్మాయ్లానే ఏంటి.? అవంతిక వందనపు నిజంగానే నిఖార్సయిన పదహారణాల తెలుగమ్మాయే.!
ఛాంపియన్ తర్వాత మరిన్ని అవకాశాలు అవంతికకి తెలుగు సినిమాల్లో వస్తాయనే ఆశిద్దాం.
