ప్రివ్యూ: వినయ విధేయ ‘మగధీరుడు’

1841 0

వినయ విధేయ రాముడొచ్చేస్తున్నాడు.. (Preview Vinaya Vidheya Rama Review) చిట్టిబాబుగా 2018లో అలరించిన మెగా వపర్‌ స్టార్‌ (Mega Power Star Ram Charan) రామ్‌చరణ్‌, ఈసారి కొత్త లుక్‌లో దర్శనమిస్తున్నాడు.

‘రంగస్థలం’ సినిమాలో సగటు పల్లెటూరి యువకుడు, అందునా 80ల నాటి యువకుడిగా చరణ్‌ నటన అద్భుతం. ఆ పాత్ర నుంచి కంప్లీట్‌ మేకోవర్‌తో ఈసారి, మెషీన్‌ గన్‌ చేతపట్టి హాలీవుడ్‌ హీరోలా ‘వినయ విధేయ రామ’ సినిమాలో కన్పించనుండడం గమనార్హం.

నటుడిగా తనకు ఇది ఇంకో మైలురాయి కాబోతోందని చరణ్‌, ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌లో ప్రకటించిన విషయం విదితమే.

మాస్‌ సినిమాల స్పెషలిస్ట్‌ బోయపాటి శ్రీను దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన ‘వినయ విధేయ రామ’ ఈ సంక్రాంతికి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైన దరిమిలా, ఆవిశేషాలేంటో ఈ ‘ప్రివ్యూ’లో తెలుసుకుందాం పదండిక.!

చిట్టిబాబు అలా, రామ్‌ కొణిదెల ఇలా! (Preview Vinaya Vidheya Rama Review)

2018లో ‘రంగస్థలం’ సినిమాతో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ అందర్నీ ఆశ్చర్యపరిచాడు. నిజమే మరి, ఎందుకంటే ఆ సినిమాలో చరణ్‌ చేసింది సాహజం. చిట్టిబాబు పాత్ర సౌండ్‌ ఇంజనీర్‌.. అదేండీ చెవిటితనం కలిగినది. ఆ పాత్రలో నటించడం అంత తేలిక కాదు. కానీ, చిట్టిబాబుగా ఒదిగిపోయాడు.

సినిమాలో చిట్టిబాబు సరదాగా అల్లరి చేశాడు, అవసరమైనప్పుడు రౌద్రం ప్రదర్శించాడు. సగటు పల్లెటూరి యువకుడి పాత్రలో చరణ్‌ నటించి మెప్పించాడు. చరణ్‌ నటనకుగాను ఇప్పటికీ ప్రశంసలు వెల్లువెత్తుతూనే వున్నాయి.

‘రంగస్థలం’ తర్వాత ఎలాంటి సినిమా చేయాలి? అనుకుంటున్న సమయంలో, ‘వినయ విధేయ రామ’ సినిమాకి గ్రీన్‌ సిగ్నల్‌ పడింది. ఇందులో చరణ్‌, ఓ ఫ్యామిలీ మ్యాన్‌. ఓ సాధారణ యువకుడు.. కుటుంబం కోసం ఏం చేయడానికైనా వెనుకడుగేయడు ఈ రామ్‌ కొణిదెల.

వినయం, విధేయత, వీరత్వం.. విధ్వంసం కూడా ‘వినయ విధేయ రామ’ సినిమాలో చరణ్‌ నుంచి చూడబోతున్నాం.

కైరా.. అదరగొట్టేసిందిరా!

‘భరత్‌ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షుల్ని పలకరించి తొలి ప్రయత్నంలోనే సూపర్‌ హిట్‌ అందుకున్న కైరా అద్వానీ (Kiara Alia Advani), తన రెండో సినిమాగా ‘వినయ విధేయ రామ’ (Preview Vinaya Vidheya Rama Review) చేసింది. ఇందులో చరణ్‌ కంటే చాలా యాక్టివ్‌గా కన్పించబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా ఆమే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

డాన్సుల్లో చరణ్‌తో పోటీ పడటం బావుందని చెబుతోన్న ఈ ముద్దుగుమ్మ, యాక్టింగ్‌లోనూ సత్తా చాటేందుకు వీలుగా మంచి పాత్ర దక్కిందని అంటోంది. మరోపక్క, ప్రోమోస్‌ చూసినవాళ్ళంతా కైరా, ఈ సినిమాతో టాలీవుడ్‌లో బిగ్‌ స్టార్‌ అయిపోయినట్లేనని చెబుతున్నారు. 2018లో ‘భరత్‌ అనే నేను’ ఈమెకు బిగ్‌ హిట్‌ ఇస్తే, 2019లో ‘వినయ విధేయ రామ’ సినిమాతో కైరా మరో సూపర్‌ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంటుందేమో.

బోయపాటి రూటే సెపరేటు..

బోయపాటి శ్రీను అనగానే మాస్‌ సినిమాలు గుర్తుకొస్తాయి. హీరోయిజం పీక్స్‌లో వుంటుంది. రౌద్రాన్ని పతాక స్థాయిలో చూపించడం, అదే సమయంలో ఫ్యామిలీ వాల్యూస్‌ని చూపించడం బోయపాటి ప్రత్యేకత. ‘చిట్టిబాబు’ తర్వాత, చరణ్‌ని నటుడిగా మరో మెట్టు ఎక్కించేలా బోయపాటి ‘వినయ విధేయ రామ’ చిత్రాన్ని రూపొందించాడట.

‘ఈ పాత్రలో చరణ్‌ని తప్ప ఇంకొకర్ని ఊహించలేం. సినిమా కోసం ఏమేం చేయాలో, అంతకన్నా ఎక్కువే చేయగల కమిట్‌మెంట్‌ వున్న నటుడు చరణ్‌’ అని బోయపాటి చెబుతోంటే, డైలాగ్స్‌ విషయంలో బోయపాటి తనను బాగా కష్టపెట్టేశాడని చరణ్‌ అంటున్నాడు.

నిజమే ఇప్పటిదాకా చరణ్‌, ఏ సినిమాలోనూ లెంగ్తీ డైలాగ్స్‌ చెప్పలేదు, ఈ సినిమాలో మాత్రం లెంగ్తీ డైలాగ్స్‌తో అదరగొట్టేస్తున్నాడట. సిక్స్‌ ప్యాక్‌ ఫిజిక్‌తో హాలీవుడ్‌ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌లో చరణ్‌ని (Preview Vinaya Vidheya Rama Review) బోయపాటి ఎలివేట్‌ చేసిన వైనం గురించి ఇండస్ట్రీలో కథలు కథలు చెప్పుకుంటున్నారు.

గ్రాండియర్‌కి కేరాఫ్‌ అడ్రస్‌ డీవీవీ మూవీస్‌

డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ – మూవీస్‌ అంటే, తెలుగులో అత్యంత ప్రతిష్టాత్మక బ్యానర్లలో ఒకటి. భారీ చిత్రాల నిర్మాతల్లో ఒకరిగా మాత్రమే కాదు, ఇంతకన్నా భారీగా చిత్రాలు తీసే నిర్మాత ఇంకొకరు లేరనేంతగా దానయ్య ఈ మధ్య అత్యంత భారీ చిత్రాల్ని భుజానికెత్తుకున్నారు.

చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ (Preview Vinaya Vidheya Rama Review) రూపొందించిన దానయ్య, రాజమౌళి – ఎన్టీఆర్‌ – చరణ్‌ కాంబినేషన్‌లో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా రూపొందిస్తున్న సంగతి తెల్సిందే. చిరంజీవి – త్రివిక్రమ్‌ కాంబోలో సినిమాకి కూడా దానయ్యే నిర్మాత.

‘వినయ విధేయ రామ’కి మరో అడ్వాంటేజ్‌ రాక్‌ స్టార్‌ దేవి శ్రీ ప్రసాద్‌ (Rock Star Devi Sri Prasad) సంగీతం. పాటలు ఇప్పటికే సూపర్‌ హిట్‌ అయ్యాయి. విజువల్స్‌ సైతం ఆకట్టుకుంటున్నాయి.

ప్రోమోస్‌, ఆడియో సింగిల్స్‌తోనే ఆడియో ఆల్బమ్‌ అదరగొట్టేస్తోంటే, రేపు సినిమా విడుదలయ్యాక ఇంకే స్థాయిలో ఆడియో సంచలనంగా మారుతుందో అర్థం చేసుకోవచ్చు.

భారీ అంచనాల నడుమ, అత్యంత భారీ స్థాయిలో విడుదలకు సిద్ధమవుతోన్న ‘వినయ విధేయ రామ’ సినిమాపై తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్‌లోనూ ఆకాశాన్నంటే అంచనాలున్నాయి.

చరణ్‌ కెరీర్‌లో ఇప్పటిదాకా బిగ్గెస్ట్‌ హిట్‌ అంటే, అది ‘రంగస్థలం’ అని ఖచ్చితంగా చెప్పగలం. దాన్ని దాటి, 150 కోట్ల వసూళ్ళతో ‘వినయ విధేయ రామ’ సత్తా చాటుతుందా? వేచి చూడాల్సిందే.

Related Post

అందానికి చిరునామా: 45 ఏళ్ళ ఐశ్వర్యం.!

Posted by - November 1, 2018 0
ఆమెకు 45 ఏళ్ళు అంటే ఎవరైనా నమ్మగలరా.? ఇంకో ఐదేళ్ళలో ఆమె 50 ఏళ్ళ వయసుకు చేరుకుంటుందంటే ఒప్పుకోగలమా.? వయసు పెరిగే కొద్దీ, తన అందాన్ని మరింతగా…
Nayanthara Tamanna Skips Sye Raa Pre Release Event

‘సైరా’కి తమన్నా, నయనతార హ్యాండిచ్చారెందుకు.?

Posted by - September 23, 2019 0
వేదిక మీద మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, దర్శక ధీరుడు రాజమౌళి.. ఇలా సినీ ప్రముఖులు ఎందరున్నా, గ్లామర్‌…

రాజశేఖర్‌ ‘కల్కి’లో గ్లామరే గ్లామర్‌!

Posted by - October 30, 2018 0
చాలాకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ప్రముఖ నటుడు డాక్టర్ రాజశేఖర్‌కి (Doctor Rajasekhar) ‘పిఎస్‌వి గరుడ వేగ’ (PSV Garuda Vega) కావాల్సినంత ఆక్సిజన్‌ ఇచ్చింది.…

‘పందెం కోడి’తో స్వీట్‌ ఫైట్‌ ‘గురూ!

Posted by - October 17, 2018 0
విజయదశమి సందర్భంగా రెండు సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద పోటీ పడ్తున్నాయి. ఒకటి డైరెక్ట్‌ తెలుగు సినిమా ‘హలో గురూ ప్రేమకోసమే’ (Hello Guru Prema Kosame) కాగా,…
KGF, Maari 2, Zero

ప్రివ్యూ: మారి-2, కెజిఎఫ్‌, జీరో

Posted by - December 20, 2018 0
స్ట్రెయిట్‌ తెలుగు సినిమాలు ‘అంతరిక్షం’, ‘పడి పడి లేచె మనసు’తోపాటుగా, ‘కెజిఎఫ్‌’ (కన్నడ), ‘మారి-2’ (తమిళ్‌) తెలుగులోకి డబ్‌ అయి, డిసెంబర్‌ 21నే ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి (KGF…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *