Baahubali Three Prabhas Rajamouli: ‘బాహుబలి ది బిగినింగ్’ నిజంగానే ఓ అద్భుతం. కానీ, ‘బాహుబలి ది కంక్లూజన్’కి వచ్చేసరికి అయోమయంలో పడ్డాడు జక్కన్న రాజమౌళి.
‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు.?’ అన్న ఒక్క ప్రశ్నకి సమాధానం వెతికే క్రమంలో, ‘బాహుబలి ది కంక్లూజన్’ మీద జనం ఎక్కువగా ఫోకస్ పెట్టారంతే. సరే, అందులోని విజువల్స్‌కి వచ్చిన ప్రశంసలు, విమర్శలు.. ఆ కథ వేరే.!
దాదాపు ఐదేళ్ళు కష్టపడి ‘బాహుబలి’ని చెక్కాడు రాజమౌళి. మళ్ళీ ఇప్పుడు మూడో ‘బాహుబలి’ అంటే, దాన్ని ఎన్నేళ్ళు చెక్కాలో ఏమో.!
Baahubali Three Prabhas Rajamouli.. బాహుబలి.. ముచ్చటగా మూడోస్సారి.!
తస్సాదియ్యా, రాజమౌళి (SS Rajamouli) మూడో బాహుబలి గురించి ప్రకటించేశాడు, అదిగదిగో సినిమా.. ఇదిగిదుగో హీరో, హీరోయిన్.. అంటూ ఎడా పెడా హాటు హాటుగా మీడియాలో కథనాలు వండేసి, వడ్డించేయడం కూడా చూస్తున్నాం.
‘ఆర్ఆర్ఆర్’ (RRR Movie) సినిమా ప్రమోషన్ల సందర్భంగా తనకు ఎదురవుతున్న చాలా ప్రశ్నలకు సమాధానం చెప్పే క్రమంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాడు రాజమౌళి.
కానీ, ‘మూడో బాహుబలి’ గురించి చిక్కు ప్రశ్నే ఎదురయ్యేసరికి, ‘చర్చలు జరుగుతున్నాయ్’ అనేశాడు. అద్గదీ అసలు సంగతి. మాహిష్మతి నుంచి త్వరలోనే మంచి కబురు వస్తుంది, నిర్మాతలు కూడా ఆసక్తిగా వున్నారని అన్నాడు రాజమౌళి.
మూడో కథ ఎలా చెప్తావ్ జక్కన్నా.?
మెయిన్ విలన్లు రానా దగ్గుబాటి (Rana Daggubati), నాజర్ చనిపోయాక మూడో ‘బాహుబలి’ (Baahubali) కోసం కొత్తగా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఏం కథ అల్లగలడు.? ఏమో, అల్లినా అల్లేయగలడు. కానీ, ఆ సినిమా తీయడానికి ఎంత సమయం పడుతుందో ఊహించగలమా.?
మహేష్‌బాబుతో (Super Star Maheshbabu) ఓ సినిమా చేయనున్నట్లు రాజమౌళి ఇప్పటికే ప్రకటించిన దరిమిలా, దానికో రెండేళ్ళు ఆ పైన ఖచ్చితంగా పడుతుంది.
Also Read: మ్యూజిక్ బాదుడు సరే.! ఈ గడబిడేంది తమన్.!
సో, రాజమౌళి – ప్రభాస్ (Prabhas) మళ్ళీ కలవాలంటే దాదాపు మూడేళ్ళ సమయం పైనే పడుతుంది. ఆ తర్వాత మరో మూడేళ్ళకు లేదా ఐదేళ్ళకు ‘మూడో బాహుబలి’ పూర్తవ్వొచ్చు.
సో, రాజమౌళిది మామూలు చెక్కుడు కాదు కాబట్టి, మూడో ‘బాహుబలి’ కోసం ఆ మూడ్ రావడం అంత తేలిక కాదన్నమాట. ఎనీ డౌట్స్.?