Table of Contents
‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer Review) పేరుతో తమన్నా ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఓ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలైంది. మాధుర్ బండార్కర్ ఈ సినిమాకి దర్శకుడు.
తమన్నా అంటేనే మిల్కీ బ్యూటీ.! తమన్నా ఏ సినిమాలో నటించినా ఫుల్ డోస్ గ్లామర్ వుండాల్సిందే. చాలా అరుదుగా మాత్రమే తమన్నా సినిమాల్లో తక్కువ గ్లామర్‌ని చూస్తుంటాం.
బబ్లీ బౌన్సర్ (Babli Bouncer) సినిమాని ‘తమన్నా గ్లామర్’ని ఆశించి చూడాలనుకోవద్దు. ఎందుకంటే, ఇందులో గ్లామర్ అస్సలు లేదు. కానీ, తమన్నా నటనను ఎంజాయ్ చేయొచ్చు.
బబ్లీ బౌన్సర్.. ఛలో ఢిల్లీ..
కథేంటంటే, బౌన్సర్లకు కేరాఫ్ అడ్రస్ ఓ చిన్న ఊరు.. అందులో పహిల్వాన్లకు శిక్షణ ఇస్తుంటారు మన హీరోయిన్ బబ్లీ తండ్రి.
తండ్రి పహిల్వాన్లకు శిక్షణ ఇస్తాడు కదా.. బబ్లీ కూడా పహిల్వాన్ అయిపోతుంటుంది. ఢిల్లీలోని ఓ బార్‌లో పని చేసే మేల్ బౌన్సర్ తమ ఊరివాడే కావడంతో, అతని సాయం తీసుకుని.. తానూ లేడీ బౌన్సర్ అయిపోతుందామె.!

లేడీ బౌన్సర్ అయ్యాక బబ్లీ బౌన్స్ ఎదుర్కొన్న పరిస్థితులేంటి.? అసలు ఢిల్లీకి వెళ్ళడానికి ‘పెళ్ళి’ పేరుతో బబ్లీ ఎందుకు నాటకం ఆడింది.? అన్నది తెరపై చూడాల్సిందే.
Babli Bouncer Review.. సీరియస్.? అస్సల్లేదు.!
‘బబ్లీ బౌన్సర్’ టైటిల్‌తోనే కాస్త కామెడీ జొప్పించారు. సో, ఈ సినిమా నుంచి మరీ సీరియస్ టచ్ ఆశిస్తే కష్టం. బీభత్సమైన యాక్షన్ ఎపిసోడ్స్ అస్సలే ఊహించకూడదు.
కంటతడి పెట్టించే ఎమోషన్స్.. లౌడ్ డైలాగ్స్.. ఇవేవీ ఆశించకూడదు ఈ ‘బబ్లీ బౌన్సర్’ (Babli Bouncer) సినిమా నుంచి. జస్ట్ సరదాగా సాగిపోతుందంతే.
ప్రేమ విషయంలో చిన్నపాటి డిజప్పాయింట్‌మెంట్.. ఉద్యోగంలో నిబద్ధత.. ఒకింత ‘మెసేజ్’.. ఇలా సాగుతుంది బబ్లీ బౌన్సర్.
ఆ కాస్త సాగతీతని పక్కన పెడితే..
కొంచెం సాగతీత అనే విషయాన్ని పక్కన పెడితే, బబ్లీ బౌన్సర్ సినిమాని హ్యాపీగా ఇంట్లోనే కూర్చుని సకుటుంబ సమేతంగా చూసెయ్యొచ్చు.
Also Read: మోసగత్తె జాక్వెలైన్‌ని సల్మాన్ ఖాన్ వదిలించుకున్నాడా.?
తమన్నాలో (Tamannaah Bhatia) కొత్త యాంగిల్ ఈ సినిమా ద్వారా మనకి తెలుస్తుంది. తన పాత్ర వరకూ ఆమె బాగా చేసింది. ఇప్పుడొస్తున్న చాలా సినిమాలతో పోల్చితే ‘బబ్లీ బౌన్సర్’ చాలా చాలా బెటర్.!