Babli Bouncer Tamannaah Bhatia.. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తన తాజా సినిమా ‘బబ్లీ బౌన్సర్’ సినిమా ప్రమోషన్లలో బిజీగా వుంది.
తాజాగా, ప్రమోషన్ కోసం హైద్రాబాద్ వచ్చింది.. ‘అగ్లీ బౌన్సర్లను’ వెంటేసుకొచ్చి, మీడియా ప్రతినిథులపై దాడి చేయించింది.!
తమన్నా (Tamannaah Bhatia) ఎందుకిలా చేస్తుంది.? విషయం అలాగే కన్వే అవుతోంది మరి.! మీడియా ప్రతినిథుల మీద బౌన్సర్ల దాడి.. అంటే, దానికి చాలా కారణాలుంటాయ్.
జర్నలిజం తీరు మారిపోయింది ఇటీవలి కాలంలో. కాంట్రవర్సీల్ని సెలబ్రిటీలు కోరుకుంటున్నారు, ఆ కాంట్రవర్సీ కోసం జర్నలిజం కూడా తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే ఇలాంటివన్నీ జరుగుతున్నాయ్.

మీడియా ప్రతినిథుల్ని అవసరానికి వాడుకోవడం, అదే సమయంలో.. ఆ మీడియా ప్రతినిథుల్ని సెలబ్రిటీలు పురుగుల్లా చూడటం కొత్తేమీ కాదు.
Babli Bouncer Tamannaah Bhatia.. చితక్కొట్టిన వైనంబెట్టిదనిన..
అసలు తమన్నా ‘బబ్లీ బౌన్సర్’ విషయంలో ఏం జరిగింది.? ఓ అత్యుత్సాహ జర్నలిస్టు (వీడియోగ్రాఫర్), ఒకింత ఓవరాక్షన్ చేశాడట. అతనికి నచ్చజెప్పేందుకు బౌన్సర్లు ప్రయత్నించారట. కానీ, విషయం ముదిరి పాకాన పడింది.
Also Read: ప్రేక్షకులు దేవుళ్ళే.! కుప్పిగంతులేస్తే, తాట తీస్తారు సుమీ.!
మాటా మాటా పెరిగి, కొట్టుకునేదాకా వెళ్ళింది. ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అదీ అసలు సంగతి. ఆ తర్వాత మిగతా జర్నలిస్టులంతా హంగామా చేసే సరకి ‘సారీ’తో సరిపెట్టారు బౌన్సర్లు.
తమ సినిమాల పబ్లిసిటీ కోసం చిత్ర విచిత్రమైన స్టంట్లు చేస్తున్నారు సినీ జనాలు.
మొన్నామధ్య విశ్వక్ సేన్, ఓ టీవీ జర్నలిస్టుని బూతులు తిట్టినా, ఈ మధ్యనే రెజినా.. ఓ జర్నలిస్టుని ‘ఓసీడీ’ విషయమై తప్పు పట్టినా.. ఇవన్నీ జస్ట్ పబ్లిసిటీ స్టంట్లు అంతే.
డౌటానుమానం అదే.!
ఇప్పుడు తమన్నా (Tamannaah Bhatia) ‘బబ్లీ బౌన్సర్’ విషయంలోనూ అదే జరిగి వుంటుందన్నది చాలామంది డౌటానుమానం. కాకపోతే, ఇలాంటి వ్యవహారాల్లో జర్నలిస్టులే వెర్రి వెంగళప్పలైపోతున్నారు.
దీన్నసలు జర్నలిజం అనొచ్చా.? అన్నదీ కాస్త ఆలోచించాల్సిన విషయమే.