Baby Vaishnavi Chaitanya Remuneration.. హీరోయిన్‌గా తొలి సినిమాతోనే మంచి హిట్టు కొట్టేసింది క్యూట్ అండ్ లవ్లీ వైష్ణవి చైతన్య. అంతకు ముందు ఆమె షార్ట్ ఫిలింస్‌తో నెట్టుకొచ్చేసింది.
చాలా అరుదైన విషయమే, తొలి సినిమాతో హీరోయిన్‌గా హిట్టు కొట్టడం.! అదీ ఓ తెలుగమ్మాయ్.. తెలుగు తెరపై నటిగా అంత పేరు తెచ్చుకోవడం కూడా.!
అసలు కథ ఇక్కడే మొదలైంది.! హిట్టు కొట్టిన వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మీద పుకార్లు షికార్లు చేయడం మొదలయ్యాయ్.
Baby Vaishnavi Chaitanya Remuneration.. రెమ్యునరేషన్ పెంచేసిందట కదా.!
ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడుగుతోందిట వైష్ణవి చైతన్య.! ఇదీ తాజా గాసిప్స్ సారాంశం. గాసిప్ అంటే గాలి వార్త కదా.! అద్గదీ అసలు సంగతి.
కానీ, ఈ తరహా గాలి వార్తలు, వైష్ణవి చైతన్య కెరీర్‌ని దెబ్బ తీస్తాయన్నది నిర్వివాదాంశం. హీరోయిన్‌కి ఎంత రెమ్యునరేషన్ ఇస్తే వర్కవుట్ అవుతుందో, నిర్మాత నిర్ణయిస్తాడు.!

గాసిప్స్‌కీ ఓ హద్దుంటుంది.. ఓ యంగ్ హీరోయిన్ కెరీర్‌తో ఇంతలా ఆటలాడటం ఎంతవరకు సబబు.? అదంతే, కాదేదీ.. గాసిప్స్‌కి అనర్హం.!
బ్లాక్‌మెయిల్ కాదు కదా.!
పేరు ప్రస్తావించకుండానే, వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) మీద కొందరు పనిగట్టుకుని వెబ్ మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తుండడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.
Also Read: ఎవరీ లోలిత.! ఎందుకీ రెస్ట్ ఇన్ పీస్.?
‘బేబీ’ హీరోయిన్.. అనే విషయం బయటకు వచ్చేశాక, ఇందులో దాపరికం ఇంకేముంది.? వైష్ణవి చైతన్య, మీడియా ముందుకొచ్చి ఈ గాసిప్స్‌ని ఖండించలేదాయె.!
అదే.. ఆ పాయింట్ పట్టుకునే, పాపం.. వైష్ణవి చైతన్య మీద.. ఇదిగో ఇలాంటి గాసిప్స్ షురూ అయ్యాయ్. ఇంకా నయ్యం.. ఎఫైర్స్ అంటగట్టేయలేదు. అదీ జరుగుద్ది కొద్ది రోజులాగితే.! నటిగా వైష్ణవి చైతన్య,
వెండి తెరపై ఇంకా చాలా చాలా సినిమాలే చేయాల్సి వుంది. నటిగా రాణించేందుకోసం కష్టపడటం ఓ యెత్తు.. ఈ తరహా బ్లాక్‌మెయిల్ ఎర్నలిజాన్ని (జర్నలిజం కాదు, ఎర్నలిజమే) తట్టుకోవడం ఇంకా కష్టం.
కష్టం మాత్రమే.. అసాధ్యమైతే కాదు.!