బిగ్‌బాస్‌లో శ్రీముఖికి (Sree Mukhi Bigg Boss 3 Winner) వెన్నుపోటు పొడిచేందుకు రంగం సిద్ధమవుతోందా.? అంటే అవునంటున్నారు సోషల్ మీడియాలో ఆమె అభిమానులు. డే వన్ నుండీ శ్రీముఖి హౌస్‌లో చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటోంది. అందరితోనూ చక్కగా కలిసిపోతోంది. ఎనర్జిటిక్‌గా అన్ని పనుల్లోనూ షేర్ చేసుకుంటోంది. అంతేకాదు, చాలా బాధ్యతగా మసలుకుంటోంది.
కొన్ని సార్లు హుందాతనం ప్రదర్శిస్తూ, అవసరమైనప్పుడు అల్లరి చేస్తూ.. వీక్షకుల్ని కట్టి పడేస్తోంది. యాంకరింగ్‌లో ఆమె డ్రెస్సింగ్ స్టైల్‌కి కొన్ని విమర్శలు వచ్చేవి.. ఆమె అల్లరినీ ఓవరాక్షన్ అని భావించేవారు కొందరు. కానీ, హౌస్‌లో శ్రీముఖి డ్రస్సింగ్ అదిరిపోయింది అనే కాంప్లిమెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే, లేటెస్ట్‌గా కొన్ని విషయాలపై శ్రీముఖి టార్గెట్ అవుతోంది.
డైనింగ్ టేబుల్ వద్ద ఫుడ్ విషయం వచ్చేసరికి శ్రీముఖి (Sree Mukhi Bigg Boss 3 Winner) తీసుకుంటున్న బాధ్యత వీక్షకుల్ని మెప్పిస్తోంది. కానీ, హౌస్‌లో కొందరిని నొప్పిస్తోంది. అడ్జెస్ట్ చేసుకుని తినాలి, అందరం ఈక్వెల్‌గా షేర్ చేసుకోవాలి.. అని శ్రీముఖి హౌస్ మేట్స్‌కిచ్చే సలహాలు, సూచనలు అవతలి వారికి నెగిటివ్‌గా పాస్ కావడంతో, మిస్ అండర్‌స్టాండింగ్ ఇష్యూస్ వస్తున్నాయి. అలాంటి సిట్యువేషన్స్‌ని కేరీ చేయడంలో శ్రీముఖి చూపిస్తున్న కన్విన్సింగ్ ఆటిట్యూడ్ అందర్నీ కట్టి పడేస్తోంది.
అంతేకాదు, హౌస్‌లో ఏ ఇద్దరి మధ్యనైనా గొడవలు రైజ్ అయినప్పుడు, అక్కడి పరిస్థితిని చక్కదిద్దడంలోనూ శ్రీముఖి చాకచక్యంగా వ్యవహరిస్తోంది. అన్నింటికీ మించి ఎందుకో ఏమో కానీ, ఎక్కువ స్క్రీన్ స్పేస్ శ్రీముఖికే దక్కుతోంది హౌస్‌లో. దాంతో ఏ సీన్‌లో అయినా తనే హైలైట్ అవుతోంది. ఈ విషయం హౌస్‌లో అందరికీ అర్ధమైపోయుంటుంది.
అందుకే ప్లాన్ చేసి, శ్రీముఖిని మానసికంగా దెబ్బ కొట్టేందుకు ట్రై చేస్తున్నారు. అందులో భాగంగా బెస్ట్ ఫ్రెండ్‌గా భావించిన రాహుల్, శ్రీముఖికి తొలి షాక్ ఇచ్చాడు. దాంతో మిగిలిన హౌస్ మేట్స్ కూడా శ్రీముఖిని టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. సో ముందు ముందు శ్రీముఖికి హౌస్‌లో కష్టకాలం తప్పేలా లేదు.
శ్రీముఖి ఆటిట్యూడ్ బాగా లేదనీ.. లెక్కలేసుకుని, బిగ్ బాస్ గత షోలు చూసేసి.. ఈక్వేషన్స్ వేసుకుని.. ఇక్కడ నటిస్తోందంటూ కొందరు హౌస్ మేట్స్ ఆరోపిస్తుండడం గమనార్హం. హౌస్ మేట్స్ అందరూ అలా వచ్చినవారే. టైటిల్ గెలవడమే లక్ష్యంగా పెట్టకుని ఈ ఆటలోకి దిగారు. ఎవరి లెక్కలు వారివి. అందరితోనూ కలుపుగోలుగా వుండాలనీ, బిగ్ హౌస్ గందరగోళంగా తయారవకూడదని శ్రీముఖి అందరి తలలో నాలుకలా వ్యవహరిస్తోంటే.. దాన్ని ‘నటనట’ అనడం ఎంతవరకు సబబు? అని ఆమె అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఎవరు ఏమనుకున్నా సరే.. బిగ్ బాస్ మూడో సీజన్ విషయానికొస్తే.. శ్రీముఖి స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్. ఆ విషయం అర్థమయిపోయిందేమో.. హౌస్ మేట్స్ అందరూ ఆమెకు వ్యతిరేకంగా పావులు కదపడం మొదలు పెట్టారు. శ్రీముఖి స్నేహితులుగా ఇప్పటివరకూ వున్న రాహుల్, అలి రెజా కూడా ఆమెకు వ్యతిరేకంగా మారిపోతున్నారు. పునర్నవి, హిమజ, వరుణ్ సందేశ్.. తదితరులూ శ్రీముఖికి వ్యతిరేకంగా స్కెచ్ వేసేస్తుండడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే, శ్రీముఖి ఇప్పుడు బిగ్ హౌస్ లో ఒంటరిగా మారిపోయింది.
ఇంతవరకూ మంచోళ్లలా కనిపించినవాళ్లే శ్రీముఖి విషయంలో తమ తమ నిజ స్వరూపం బయటపెడుతున్నారు. వీరి నుండి శ్రీముఖి ఎలా తనను తాను ఎలివేట్ చేసుకుంటుందో, హౌస్‌లో ఎలా నిలదొక్కుకుంటుందో చూడాలి మరి.