Balakrishna Chiranjeevi Pawan Kalyan.. నందమూరి బాలకృష్ణ అనూహ్యంగా మెగాస్టార్ చిరంజీవి మీద ఏపీ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.
నిజానికి, ఈ వ్యాఖ్యల్ని టీడీపీలోనే చాలామంది సమర్థించని పరిస్థితి. ‘ఏదిఏమైనా, నందమూరి బాలకృష్ణ అలా అని వుండకూడదు’ అన్న అభిప్రాయమే అంతటా వ్యక్తమవుతోంది.
హిందూపురం ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ, అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రిని ‘సైకోగాడు’ అనడం సబబు కాదు. చిరంజీవి ప్రస్తావన కూడా అసమంజసం.
Balakrishna Chiranjeevi Pawan Kalyan.. పవన్ కళ్యాణ్ ఎటువైపు.?
ఈ మొత్తం వ్యవహారంపై, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో.? అంటూ, వైసీపీ అను‘కుల’ మీడియా ఓ కొత్త ప్రశ్నని తెరపైకి తెచ్చింది.
టీడీపీ అను‘కుల’ మీడియా కూడా ఇదే ప్రస్తావన చేస్తోంది, తమ తమ విశ్లేషణల్లో. బాలయ్య చేసింది తప్పని మాత్రం, టీడీపీ అను‘కుల’ మీడియా చెప్పదు.

వైసీపీ అను‘కుల’ మీడియా, ఓ వైపు బాలయ్యని తూలనాడుతూనే, చిరంజీవిని వివాదాల్లోకి లాగుతోంది. సో, ఇది నిజంగానే పవన్ కళ్యాణ్‌కి కొంత సంకట పరిస్థితి.
ఎటూ, టీడీపీలోనూ ఎవరూ బాలయ్యని సమర్థించడంలేదు గనుక, పవన్ కళ్యాణ్ కూడా సమర్థించకపోవచ్చు బాలయ్య వ్యాఖ్యల్ని.
పైగా, అన్నయ్య మీద ఈగ వాలనివ్వరు పవన్ కళ్యాణ్. పొత్తు ధర్మం పాటించాలి గనుక, పవన్ కళ్యాణ్ కొంత వ్యూహాత్మక మౌనం పాటించే అవకాశాలూ వున్నాయి.
చంద్రబాబు ఏమంటారో..
ఇక్కడ, అసలు సమస్య చంద్రబాబుకే. మిత్ర ధర్మం పాటించకుండా, చిరంజీవి మీద బాలకృష్ణ అలా ఎలా నోరు జారతారన్న ప్రశ్న, జనసేన నుంచి టీడీపీ వైపుకు దూసుకెళుతోంది.
ఈ క్రమంలో, చంద్రబాబు ఒకింత ఆచి తూచి వ్యవహచించాల్సి వుంటుంది. బాలయ్యని పిలిచి, చంద్రబాబు ఈపాటికే మందలించి వుంటారన్నది తాజాగా ప్రచారంలోకి వచ్చిన ఓ గాసిప్.

బాలయ్య వల్ల, అసెంబ్లీలో టీడీపీకి ప్రత్యేకించిన ఉపయోగం ఏమీ లేదు. హిందూపురం ఎమ్మెల్యేగా టీడీపీకి బాలయ్య వల్ల అదనపు అడ్వాంటేజ్ కూడా ఏమీ లేదు.. ఇవన్నీ టీడీపీలో వినిపించే మాటలే.
Also Read: పాత్రికేయమంటే.! పక్కలెయ్యడమే..నా.?
సందట్లో సడేమియా, బాలయ్యని టీడీపీలోని జూనియర్ ఎన్టీయార్ వర్గం తీవ్రంగా తప్పుపడుతోంది.
