Balakrishna To Join Janasena.. నందమూరి బాలకృష్ణ ఎందుకు జనసేన పార్టీలో చేరతారు.? ఏం, ఎందుకు చేరకూడదు.? రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు.!
‘ఈ స్నేహం ముప్ఫయ్ ఏళ్ళ క్రితం ప్రారంభమైతే బావుండేది..’ అంటూ నందమూరి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్‌తో ‘ఆప్యాయంగా చేతులు కలిపి’ చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి, ఆలోచింపజేస్తున్నాయి.
మట్టిని నమ్ముకున్న రైతు.. తినడానికి పట్టెడన్నం లేక బాధపడుతూ ఆత్మహత్య చేసుకుంటే.. ఆ రైతు కుటుంబాన్ని ఆదుకునేందుకు నీ కష్టార్జితాన్ని ఖర్చు చేయడాన్ని ఎవరైనా అభినందించాల్సిందే..
పవన్ కళ్యాణ్‌ని ప్రశంసలతో ముంచెత్తిన బాలకృష్ణ
సంక్షేమ పాలన చేసిన తెలుగుదేశం పార్టీలో చేరొచ్చు కదా.? అని బాలకృష్ణ ప్రశ్నిస్తే, ‘సంక్షేమం కాదు.. అధికారం అందరికీ సమానంగా పంచబడాలి..’ అని పవన్ కళ్యాణ్ బదులిచ్చారు.
Balakrishna To Join Janasena.. సంకల్పం గొప్పది..
ఔను, జనసేనాని సంకల్పం చాలా చాలా గొప్పది. ‘అధికారం వుంటేనే సేవ చేస్తాం..’ అనే పార్టీలతో ప్రజలకు ఉపయోగం వుండదు.
అధికారంలో వున్నా, లేకున్నా ప్రజల కోసం చేతనైనంత చేస్తానని చెప్పడమే నాయకుడి లక్షణం. ఆ నాయకత్వ లక్షణం చాలా గొప్పదని నందమూరి బాలకృష్ణ కూడా కొనియాడారు.
రాజకీయాల్లో నువ్వు అనుకున్నది సాధిస్తావ్.. ఎందుకంటే, నీ సంకల్పం గొప్పది. జనం కోసం ధైర్యంగా నిలబడే నీ తెగువ నాకు నచ్చింది..
Nandamuri Bala Krishna
సో, నందమూరి బాలకృష్ణ (Nandamuri Bala Krishna) ఎందుకు జనసేన పార్టీలో చేరకూడదు.? 2014 ఎన్నికల సమయంలో టీడీపీ – బీజేపీలకు జనసేన పార్టీ మద్దతిచ్చింది.
అన్‌స్టాపబుల్ విషయంలో అయినా, బాలకృష్ణ విషయంలో అయినా.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌కి ముందు.. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ తర్వాత.. అనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

బాలకృష్ణలోని కొత్త కోణం.. అలాగే, పవన్ కళ్యాణ్ (Janasenani Pawan Kalyan) పోరాటంలో నిజాయితీ.. ఇవి మరింతగా ఎలివేట్ అవుతున్నాయి.
Also Read: ఔనూ.! చిరంజీవిని కోడిగుడ్లతో ఎందుకు కొట్టారు.?
ఇప్పుడెందుకు పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ లాంటోళ్ళు మద్దతివ్వకూడదు.? పార్టీలకతీతంగా, సరికొత్త స్నేహ హస్తం.. పవన్ కళ్యాణ్‌కి బాలకృష్ణ అందిస్తే.?
ఏమో, ఈక్వేషన్స్ మారతాయేమో.. జనసేనలో నందమూరి బాలకృష్ణ చేరతారేమోనన్న చర్చ జనాల్లో గట్టిగానే జరుగుతోంది.