Table of Contents
Balakrishna With Pawan Kalyan.. రాజకీయాల్లో శాశ్వత శతృవులు, శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది ఓ వాదన.! ఏం.. స్నేహమెందుకు శాశ్వతంగా వుండకూడదు.? అసలు, శతృత్వం ఎందుకు వుండాలి.?
వాస్తవానికి రాజకీయమంటేనే ప్రజా సేవ.! ప్రజలకు సేవ చేసే క్రమంలో అభిప్రాయ బేధాలుండొచ్చుగానీ, శతృత్వం ఎందుకు వుంటుంది.?
చాలాకాలంగా రాజకీయ నాయకులు, ప్రజల్ని మభ్యపెడుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రజల్ని కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా విడదీస్తూనే వున్నాయి.
కమ్మ – కాపు కలయిక.!
కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం.. ఈ రెండు సామాజిక వర్గాల మధ్య వైరం.. అనేది ఓ కల్పిత కథ.!
పనీ పాటా లేని కొందరు కొట్టుకు ఛావడానికి తప్ప, ఈ కొట్లాటల వల్ల ఎవరికి లాభం.? ఆ మాత్రం ఇంగితం సామాన్యులకు వుండదా.? ఎందుకు వుండదు.? వుంటుంది కాబట్టే.. ప్రజలు కలిసి మెలిసి వుంటారు.
ఔనూ.. రాజకీయమంటే కులాల కుంపట్లు అనీ.. మతాల మధ్యన అడ్డు గీతలనీ.. అసలు చెప్పిందెవరు.?
కమ్మ వర్సెస్ రెడ్డి.. కాపు వర్సెస్ కమ్మ.. రెడ్డి వర్సెస్ కాపు.. ఏంటీ పంచాయితీ.? తెలుగునాట.. అందునా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే కులాలు లేవా.?
కులాల చుట్టూ.. మతాల చుట్టూ ఇంకెన్నాళ్ళు రాజకీయాల్ని తిప్పుతారు.? అధికారం అంటే ఏంటో తెలియని కులాలు అధికార పీఠమెక్కేదెప్పుడు.?
కులం, మతం.. ఇవన్నీ మానవత్వం ముందు బలాదూర్.!
అసలు రాజకీయాల్లో మాట్లాడకూడనిదే కులం గురించీ, మతం గురించీ.
కానీ, వాటి ప్రస్తావన లేకుండా అసలు రాజకీయాలే కనిపించడం లేదు.!
Mudra369
రాజకీయ పైత్యమే ఈ కులాల కుంపట్లకు కారణం. సినిమా స్టార్ల చుట్టూ బలవంతంగా ‘కవర్’ చేయబడ్డ కుల పైత్యం కూడా రాజకీయం కంటే తక్కువ హేయమైనదేమీ కాదు.!
Balakrishna With Pawan Kalyan.. చిరంజీవి.. బాలకృష్ణ..
సినీ రంగంలో చిరంజీవి, బాలకృష్ణ మధ్య పోటీ గురించి అందరికీ తెలిసిందే. అభిమానులు కులాల వారీగా విడిపోరు.! కానీ, విడిపోయినట్లు కొందరు చిత్రీకరిస్తారు. అదే అసలు సమస్య.
నిజానికి చిరంజీవి – బాలకృష్ణ మధ్య సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ విషయాన్ని ఇద్దరూ పలు సందర్భాల్లో స్వయంగా చెప్పారు కూడా.!
కమ్మ పార్టీ అనే విమర్శలెదుర్కొంటున్న టీడీపీలో రెడ్డి, కాపు సామాజిక వర్గాలకు చెందిన నాయకులున్నారు.
రెడ్ల పార్టీ అన్న విమర్శలు ఎదుర్కొనే వైసీపీలోనూ కాపు, కమ్మ సామాజిక వర్గాలకు చెందిన నాయకులున్నారు.
కాపు పార్టీ అనే ముద్ర జనసేన మీద కొందరు బలవంతంగా వేసేసినా, అందులోనూ కమ్మ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నేతలున్నారు.
అలాంటప్పుడు, రాజకీయ పార్టీలు ఎందుకు ఈ కుల రాజకీయాలు చేస్తున్నట్టు.?
Mudra369
వాళ్ళిద్దరికీ లేని గొడవలు అభిమానులకు మాత్రం ఎందుకు.? చిరంజీవి – బాలకృష్ణ అనే కాదు, మిగతా హీరోల విషయంలోనూ.. అభిమానుల మధ్య గొడవలు ఎందుకు వుండాలి.?
రాజకీయ స్నేహం మాత్రమేనా.?
టీడీపీ – జనసేన మధ్య 2024 ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పొత్తు పొడుస్తోంది. ఈ నేపథ్యంలోనే, ‘సోదరుడు పవన్ కళ్యాణ్’ అంటూ నందమూరి బాలకృష్ణ తాజాగా వ్యాఖ్యానించారు.
Also Read: ఇండియా! భారత్! రెండు పేర్ల మధ్య చిచ్చు పెడుతున్నదెవరు?
జనసేనాని చేపట్టబోయే మలి విడత వారాహి విజయ యాత్రకు టీడీపీ తరఫున మద్దతు పలికారు నందమూరి బాలకృష్ణ. టీడీపీ – జనసేన శ్రేణులు మాత్రమే కాదు, ఆయా హీరోల సినీ అభిమానులూ కలవడానికి ఓ అద్భుతమైన అవకాశమిది.
అన్నిటికీ మించి, కమ్మ – కాపు అన్న వైరాన్ని పట్టుకుని వేలాడుతున్న ‘కొందరు’ ఇకనైనా, మూర్ఖత్వం వీడతారని ఆశిద్దాం.!