జస్ట్ ఆస్కింగ్: విగ్రహాలు పెట్టమని అంబేద్కర్ అడిగారా.?
Ambedkar Statue Telugu Politics.. ఊరూ వాడా రాజకీయ నాయకుల విగ్రహాలు చూస్తోంటే, చిర్రెత్తుకొస్తుంటుంది.! ఏం చేస్తాం.. ఇదొక దిక్కుమాలిన రాజకీయ స్వామ్యం.!
మహాత్మా గాంధీ విగ్రహం కావొచ్చు, బాబా సాహెబ్ అంబేద్కర్, సుభాష్ చంద్రబోస్ తదితరుల విగ్రహాలు కావొచ్చు.. ఇలాంటివాటిని చూసినప్పుడు కలిగే అనుభూతి వేరు.!
అసలు, గాంధీ అయినా, అంబేద్కర్ అయినా, బోస్ అయినా.. వీళ్ళెవరూ తమ విగ్రహాల్ని జనం నడి రోడ్ల మీద పెడతారని ఆశపడి వుండరు.!
Ambedkar Statue Telugu Politics.. విగ్రహ రాజకీయం అత్యంత బాధాకరం..
మహనీయుల్ని, గొప్ప గొప్ప వ్యక్తుల్ని స్మరించుకోవడం అంటే, మనల్ని మనం గౌరవించుకోవడమే.! అయితే, ఆ విగ్రహాలు ట్రాఫిక్ ఇబ్బందులకు కారణమైతే, అవి ఆకతాయిల చేతుల్లో నాశనమవుతోంటే.. చాలా చాలా బాధ కలుగుతుంటుంది.
దేశంలో అత్యంత ఎత్తయిన మహాత్మా గాంధీ విగ్రహం వుందా.? అత్యంత ఎత్తయిన సుభాష్ చంద్రబోస్ విగ్రహం వుందా.? వల్లభాయ్ పటేల్ విగ్రహం కావొచ్చు, అంబేద్కర్ విగ్రహాలు కావొచ్చు.. ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశాలవుతున్నాయ్.?
అందునా, తెలుగునాట అంబేద్కర్ విగ్రహాల పేరుతో అధికార పార్టీలు రాజకీయం షురూ చేశాయ్.
వందల కోట్లు.. ఎవడబ్బ సొమ్మనీ..
పెద్దమొత్తంలో ప్రజాధనం వెచ్చించి, అంబేద్కర్ విగ్రహాల్ని భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్న వైనం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
వందల కోట్లు వెచ్చించి, ఇంత పెద్ద విగ్రహాలు పెట్టడం ఎంతవరకు అవసరం.? ఆ మొత్తంతో, అంబేద్కర్ పేరుతోనే.. పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించవచ్చు కదా.?
ఓటు బ్యాంకు రాజకీయం.. ఇదీ, ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాల మాటున జరుగుతున్న వ్యవహారం.!
వృధా ఖర్చుని అంబేద్కర్ గనుక జీవించి వుంటే, సమర్థించేవారే కాదు.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇది నిష్టుర సత్యం.!
సంక్షేమ పథకాలకి అంబేద్కర్ లాంటి మహనీయుల పేర్లు పెట్టలేని రాజకీయ పార్టీలు, విగ్రహాల పేరుతో చేస్తున్న రాజకీయాన్ని ఏమనాలి.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?