Bandla Ganesh Neeli Sitharalu.. సినిమా అన్నాక గాసిప్స్ సహజం. అయితే, అవిప్పుడు శృతి మించుతున్నాయ్.! సినీ ప్రముఖుల ఇళ్ళల్లోకి తొంగి చూడటమే ‘జర్నలిజం’ అయిపోయింది కొందరికి.
బెడ్రూమ్‌లు, బాత్రూమ్‌లు కూడా వదలడంలేదు.! వున్నవీ లేనివీ పోగేసి, పిచ్చి రాతలతో సెలబ్రిటీల్ని వేధించడమే మీడియా పనిగా మారిపోయింది.
అసలు విషయానికొస్తే, నటుడు అలాగే నిర్మాత కూడా అయిన బండ్ల గణేష్ (Bandla Ganesh), సోషల్ మీడియా వేదికగా సంచలన ట్వీట్లు చేస్తూ వున్నాడు.
Bandla Ganesh Neeli Sitharalu.. గురూజీ గోల.! నీలి చిత్రాల లీల.!
గురూజీ అంటే ఎవరో తెలుసు.! ఆ గురూజీ మీద బండ్ల గణేష్‌కి కోపమొచ్చింది. ‘గిఫ్టులు ఇస్తే, నిర్మాతగా ఛాన్సులు పట్టేయొచ్చు..’ అంటూ గురూజీపై సెటైర్లేశాడు బండ్ల గణేష్.
Also Read: బండ్ల సలహా.! గురూజీకి గిఫ్టు కొట్టు.! నిర్మాతగా ఛాన్సు పట్టు.!
ఆ వ్యవహారం హాట్ టాపిక్ అయ్యింది. గురూజీ అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఆ గురూజీ వల్లనే ‘దేవర’ పవన్ కళ్యాణ్‌తో భక్తుడు బండ్ల గణేష్‌కి దూరం పెరిగిందట.
ఈ విషయాన్ని పలు సందర్భాల్లో పరోక్షంగా, కొన్ని సందర్భాల్లో నేరుగానే బండ్ల గణేష్ (Bandla Ganesh) సెలవిచ్చాడు.

ఈ వ్యవహారంపై మీడియాలో వచ్చిన కథనాలపై బండ్ల గణేష్ (Bandla Ganesh) గుస్సా అయ్యాడు. ‘అభిమానిస్తాం, ప్రేమిస్తాం, అలుగుతాం..’ అంటూ వివరణ ఇచ్చుకున్నాడు.
అలా అనకూడదు బండ్ల గణేష్.?
‘నీలి వార్తలు రాసుకునే నీ బతుకు.. నీ ఇంట్లో నువ్వు లేనప్పుడు జరుగుతున్న నీలి చిత్రాల గురించి రాుకోరా బఫూన్ కొడకా..’ అంటూ ఓ మీడియా సంస్థ అధినేత మీద బండ్ల గణేష్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశాడు.
Also Read: Hansika Motwani Gutle.. అరే ‘గూట్లే’.! నీకెవరు చెప్పార్రా.!
ఇదెక్కడి పంచాయితీ.? అయినా, ఇంట్లోవాళ్ళని లాగడమేంటి.? సదరు మీడియా సంస్థ అధిపతికి ‘ఇజ్జత్’ లేకపోయినా, బండ్ల గణేష్ అలా అని వుండకూడదేమో.!
ఏమో.! బండ్ల గణేష్ ఏమన్నా లీక్స్ ప్లాన్ చేస్తున్నాడేమో.. కుక్క కాటుకి చెప్పు దెబ్బ అన్నట్టు.! మీడియా ముసుగులో ఎలాంటి చెత్త రాతలైనా రాయొచ్చుకునేవారికి ఇదో హెచ్చరికలానే కనిపిస్తోంది.