Bandla Ganesh Slams Trivikram గత కొంతకాలంగా కమెడియన్, నిర్మాత బండ్ల గణేష్‌కీ ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కీ మధ్య కోల్డ్ వార్ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే అస్సలు బండ్ల గణేష్‌ని పట్టించుకోవడంలేదు. బండ్ల గణేష్ మాత్రం వీలు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్ శ్రీనివాస్ మీద పరోక్షంగా సెటైర్లేస్తున్నాడు.
సోషల్ మీడియా వేదికగా బండ్ల గణేష్ తాజాగా కొన్ని ట్వీటాస్త్రాలు వదిలాడు. వాటిల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదుగానీ.. అవన్నీ త్రివిక్రమ్ పైకి సంధించిన అస్త్రాలేనని అర్థమవుతున్నాయి.
Bandla Ganesh Slams Trivikram.. మోసం చేసిన మేధావి..
‘మోసం చెయ్యాలనుకునేవాడు మేధావిలా నటిస్తాడు..’ అంటూ బండ్ల గణేష్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కి బండ్ల గణేష్‌ని మోసం చేయాల్సిన అవసరమేమొచ్చింది.?
అంతే కాదండోయ్, ‘వంచించాలనుకునేవాడు గురువులా నటిస్తాడు..’ అని కూడా బండ్ల గణేష్ ట్వీటేశాడు.
‘కానీ, నిజాయితీగా వుండేవాడు ఎప్పుడూ భక్తుడిగానే పొగురుగా వుంటాడు.. అది మీకు నచ్చినా నచ్చకపోయినా..’ అంటూ బండ్ల వేసిన ట్వీట్ గురించి సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ మీద కూడా..
ఇక్కడ ‘భక్తుడు’ ప్రస్తావన రావడంతో.. పవన్ కళ్యాణ్‌ని కూడా బండ్ల వివాదంలోకి లాగాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్‌ని దేవరగా అభివర్ణిస్తుంటాడు బండ్ల గణేష్. పైగా, తాను ఆ దేవరకి భక్తుడినని కూడా బండ్ల గణేష్ చెప్పడం విన్నాం.

ఇటీవల ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో సందర్భంగా, ‘గురూజీ’ అంటూ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: Anasuya Bharadwaj: క్రేజీయెస్ట్ రోలర్ కోస్టర్ రైడ్.!
నిజానికి, పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ మధ్య చాలా మంచి స్నేహం వుండేది. అది ఒకప్పుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ స్నేహాన్ని చెడగొట్టాడన్న ఆరోపణలూ లేకపోలేదు.
పవన్ కళ్యాణ్ – బండ్ల గణేష్ కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మితం కావాల్సి వుండగా, పవన్ కళ్యాణ్ సినిమాల వ్యవహారాల్ని త్రివిక్రమ్ తెరవెనుకాల చక్కబెడుతున్న దరిమిలా.. బండ్ల గుస్సా అవుతున్నాడు.
తాను చేయాల్సిన సినిమా విషయంలో పవన్ కళ్యాణ్‌ని తన నుంచి త్రివిక్రమ్ దూరం చేశాడన్నది బండ్ల గణేష్ ఆరోపణగా కనిపిస్తోంది.