దివి.. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో గ్లామరస్ బ్యూటీ. సరిగ్గా 50 రోజులకి ఆమెను ఇంట్లోంచి బయటకు పంపేశారు. నిజానికి, ఆమె టాప్ 5లో వుండాల్సిన కంటెస్టెంట్. ఏమయ్యిందో, అనూహ్యంగా దివిని (BB Telugu Grand Finale Abijeet) ఎలిమినేట్ చేసేశారు.
అయితేనేం, దివికి వున్న ఫాలోయింగ్ అస్సలేమాత్రం తగ్గలేదు. మెహబూబ్‌తో కలిసి రీ-యూనియన్ ఎపిసోడ్‌లో హల్‌చల్ చేసింది దివి. హౌస్ మేట్స్‌ని గాజు అద్దాల అవతలి నుంచి క్యూట్ క్యూట్‌గా పలకరించిన దివి, అంతకు ముందు మెహబూబ్‌తో చేసిన డాన్సులు కెవ్వు కేక.
Also Read: బిగ్‌బాస్ విన్నర్ ఎవరు.? షాకింగ్ ట్విస్ట్ ఇదేనా.!
హౌస్‌లో ప్రతి ఒక్కరినీ తనదైన స్టయిల్లో పలకరించిన దివి, అబిజీత్‌తో ఇంకాస్త ప్రత్యేకంగా కళ్ళు కలిపింది. ఇంతకీ, అబిజీత్‌కి కళ్ళతో దివి ఏం చెప్పింది.? దివి కళ్ళలో అబిజీత్ ఏం చూశాడు.? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. నిజానికి, దివి మాత్రమే కాదు.. వచ్చిన పాత కంటెస్టెంట్స్ అంతా అబిజీత్‌కి కళ్ళతోనే చెప్పాలనుకున్నది చెప్పేశారు.
దివి ఇంకాస్త స్ట్రయికింగ్‌గా అబిజీత్‌కి అసలు విషయం చెప్పింది. అదేంటంటే, ఈ సీజన్ విన్నర్ అబిజీత్ మాత్రమే అని. ఓట్ల పరంగా, బయట వున్న మూడ్ పరంగా అబిజీత్‌ని విన్నర్‌గా మిగతా హౌస్‌మేట్స్ కూడా (ఎలిమినేట్ అయి బయటకు వెళ్ళినవాళ్ళంతా) డిసైడ్ చేసేశారు.
Also Read: బిగ్‌బాస్ విన్నర్ అబిజీత్.. ఇదిగో సాక్ష్యం.!
కానీ, బిగ్‌బాస్ నిర్ణయం ఎలా వుందో ఇప్పుడే చెప్పలేం. దానికి కాస్త సమయం పడుతుంది. ఫినాలె ఎటూ వచ్చేసింది గనుక.. కొద్ది గంటల్లోనే ఆ విషయం కూడా తేలిపోతుంది. ఒక్కటి మాత్రం నిజం.. అబిజీత్ ఆల్రెడీ విన్నర్ అయిపోయాడు.
ఇప్పుడేంటి, ఎప్పుడో అబిజీత్ విన్నర్.. (BB Telugu Grand Finale Abijeet) అని అంతా డిసైడ్ అయిపోయారు. మొన్నటికి మొన్న బిగ్‌బాస్ కూడా, ‘అబిజీత్, మీరు హౌస్‌లో వుండడం బిగ్‌బాస్‌కి గర్వకారణం..’ అని చెప్పేసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? ఇంతకన్నా గొప్ప గెలుపు ఏ కంటెస్టెంట్‌కి అయినా ఇంకేముంటుంది.?