బిగ్‌హౌస్‌లో సమ్‌థింగ్ రొమాంటిక్ వ్యవహారం నడుస్తోంది. ఆ ట్రాక్ (Punarnavi Rahul Love Track) ఎవరి మీదనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పునర్నవి భూపాళం – రాహుల్ సిప్లిగంజ్ (Punarnavi Bhupalam Rahul Sipligunj) ఈ మధ్య బాగా క్లోజ్ అయిపోయారు. బిగ్‌హౌస్‌లో రాఖీ సెలబ్రేషన్స్ జరిగినప్పుడు రాహుల్‌కి మాత్రమే రాఖీ విషెస్ చెప్పలేదు పునర్నవి.
అయితే, మొదట్లో శ్రీముఖి (Sree Mukhi), రాహుల్ మధ్య ఫ్రెండ్‌షిప్ నడిచింది. అది బ్రేక్ అయ్యాకా, పునర్నవి – రాహుల్ మధ్య కెమిస్ట్రీ స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు పునర్నవి వివిధ అంశాలపై హౌస్‌లో తనను తాను డిఫెండ్ చేసుకోవడం మాటెలా ఉన్నా, రాహుల్‌ని వెనకేసుకు రాలేక సతమతమవుతోంది.
తాజా నామినేషన్స్‌లో పునర్నవి, రాహుల్‌ని నామినేట్ చేసింది. ఈ సందర్భంగా ఆమె, రాహుల్‌కి ఇచ్చిన ఆడ్వయిజ్ విన్నాకా, రాహుల్‌ని ఆమె ఎంత కేర్ చేస్తుందో, అర్ధమవుతుంది. గేమ్‌ని లైట్ తీసుకోవద్దనీ, సీరియస్‌గా పార్టిసిపేట్ చేయాలనీ, మిగతా వాళ్లని చూసి అయినా నేర్చుకోవాలనీ, ఆ ఫన్ నేచర్‌ని పక్కన పెట్టాలనీ పునర్నవి, రాహుల్‌కి సీరియస్‌గా క్లాస్ తీసుకుంది.
ఈ సమయంలో రాహుల్ కొంత భావోద్వేగానికి గురయ్యాడు. ఈ నామినేషన్స్ ప్రక్రియలో అత్యధిక ఓట్లు రాహుల్‌కే దక్కాయి. అంటే, మెజార్టీ సభ్యులు రాహుల్ హౌస్‌లో ఉండడానికి ఇష్టపడడం లేదన్న మాట. ఇది రాహుల్‌కి బ్రేకింగ్ పాయింట్. పునర్నవి ఆవేదనను రాహుల్ అర్ధం చేసుకోవాలి. లేకపోతే, హౌస్ నుండి రాహుల్ (Punarnavi Rahul Love Track) ఎలిమినేట్ అవ్వడం అతి త్వరలోనే జరగొచ్చు.
మరోపక్క రాహుల్, పునర్నవితో పాటు, హిమజ, శివజ్యోతి, అషూరెడ్డి, మహేష్ విట్టా, బాబా భాస్కర్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియకు నామినేట్ అయి ఉన్నారు. వీరిలో ఎవరు అవుట్ అయిపోతారన్నది ఆదివారం తెలుస్తుంది. కాగా, హౌస్‌లో ఈక్వేషన్స్ చాలా దారుణంగా మారిపోతున్నాయి.
బిగ్ హోస్ట్ అక్కినేని నాగార్జున మాస్క్‌లు తీసేయమని చెప్పినా, ఎవరూ అవి తీసేయడం లేదు సరికదా. అదనపు మాస్క్‌లు ధరిస్తున్నారు.