Home » అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!

అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!

by hellomudra
0 comments

అనసూయ (Anasuya Bharadwaj) అంటే అందం, అనసూయ అంటే ఆత్మవిశ్వాసం.. అంతే కాదండోయ్‌, అనసూయ అంటే ఆగ్రహం కూడా.! అర్థం పర్థం లేని విమర్శలు ఎవరన్నా చేశారో అంతే సంగతులు.. ఆగ్రహంతో ఊగిపోతుంటుంది.

తప్పుని తప్పు అని చెప్పగలిగే ధైర్యం అనసూయ సొంతం. ఈ క్రమంలో ఎవరెంతలా విరుచుకుపడినా, నేర్పుగా సమాధానం చెప్పగలదు అనసూయ. బుల్లితెర, వెండితెర.. ‘తెర’ ఏదైనా, అనసూయ హవా మాత్రం కొనసాగుతూనే వుంది.

ఒకప్పుడు న్యూస్‌ రీడర్‌గా పనిచేసినా, ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్‌గా కన్పించినా.. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ, బుల్లితెరపై ప్రయాణం కొనసాగిస్తున్నా.. అనసూయ ‘ప్రయాణం’ చాలా ప్రత్యేకం.

ఏం, పెళ్ళయితే హాట్‌గా కన్పించకూడదా.? పెళ్ళయితే డాన్సులు చేయకూడదా.? పెళ్ళయితే సినిమాల్లో నటించకూడదా.? హాట్‌గా కన్పిస్తే మాత్రం, సమస్యలపై స్పందించకూడదా.? అంటూ తనపై వచ్చే విమర్శలకు అనసూయ (Anasuya) ఘాటుగా సమాధానం చెప్పేటప్పుడు ఆమెలోని ఆ ‘కాన్ఫిడెన్స్‌’, ఆమె ప్రదర్శించే ఆటిట్యూడ్‌ సింప్లీ సూపర్బ్‌ అంతే.

నేను ఆంటీనే.. అయితే తప్పేంటి.?

‘నేను, నా భర్త.. నా పిల్లలు.. ఇదీ నా కుటుంబం..’ అంటూ ఎప్పటికప్పుడు అనసూయ (Anasuya Bharadwaj), సోషల్‌ మీడియాలో ఫొటోలు పోస్ట్‌ చేస్తూనే వుంటుంది. ఫ్యామిలీకి తగినంత టైమ్‌ కేటాయించడం, బిజీ లైఫ్‌ నుంచి కాస్త వెసులుబాటు కల్పించుకుని.. ప్రపంచాన్ని చుట్టేయడం అనసూయకి అలవాటు.

ఈ క్రమంలో అనసూయ (Anasuya Bharadwaj), సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసే ఫొటోలు వైరల్‌ అవుతుంటాయి. వాటిని కొందరు అసభ్యకరంగా చిత్రీకరిస్తుంటారు. ఇంకొందరైతే, ‘ఏం ఆంటీ, ఇవన్నీ నీకు అవసరమా.?’ అని ప్రశ్నిస్తుంటారు.

అనసూయ మాత్రం, ‘ఔను, నేను ఆంటీనే.. ఇలా వుంటే తప్పేంటి.? మీ చూపులోనే తేడా వుంది.. సరిచేసుకోండి.’ అని బదులిస్తుంటుంది. అదీ ఆమె ఆటిట్యూడ్. ట్రెండు మారింది.. మీ బ్రెయిన్లు మార్చుకోండని చెప్పడంలో అనసూయకు సాటి ఇంకెవరూ రారేమో.

బుల్లితెరపై మకుటం లేని మహారాణి

జబర్‌దస్త్‌ (Jabardast) అంటే అనసూయ.. అనసూయ అంటే జబర్‌దస్త్‌. ఈ ప్రోగ్రామ్‌ అనసూయ ఇమేజ్‌ని పెంచిందని నిస్సందేహంగా చెప్పొచ్చు. అదే సమయంలో, అనసూయ గ్లామర్‌, ఆమె అప్పీయరెన్స్‌ ఈ ప్రోగ్రామ్‌కి మరింత పాపులారిటీ తెచ్చిపెట్టిందనీ ఒప్పుకుని తీరాల్సిందే.

‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘క్షణం’, ‘విన్నర్‌’ తదితర సినిమాల్లో నటించినా, బుల్లితెరను అనసూయ వదల్లేదు. ఎందుకంటే, బుల్లితెర ద్వారా తాను ఎదిగిన వైనాన్ని ఆమె మర్చిపోదు కాబట్టి. బుల్లితెర, వెండితెర కెరీర్‌ పరంగా తనకు రెండు కళ్ళని చెబుతుంటుంది అనసూయ. నిజమే మరి.!

‘క్షణం’ నుంచి ‘కథనం’ వరకూ.!

సినిమాల్లో అవకాశాలు అనసూయకి ఎప్పటినుంచో వస్తున్నాగానీ, కథల ఎంపికలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుంటూ, సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు దక్కిన అద్భుతమైన అవకాశం ‘క్షణం’ (Kshanam). ఈ సినిమాలో నెగెటివ్‌ షేడ్స్‌ వున్న పాత్రలో అనసూయ నటించి మెప్పించింది.

నిజానికి ‘క్షణం’ తర్వాత ఆమెకు పలు సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. వచ్చిన ఆఫర్లను వచ్చినట్లే ఒప్పేసుకుంటే ఆమె అనసూయ ఎందుకవుతుంది. సినిమాల ఎంపికలో ఆమెది ప్రత్యేకమైన శైలి.

ప్రస్తుతం ‘కథనం’ (Kathanam) అనే సినిమాలో నటిస్తోంది అనసూయ. ఈ సినిమా కూడా అనసూయలో కొత్త యాంగిల్‌ని చూపించబోతోందట. సినిమాల్లో నటించడం మాత్రమే కాదు, ఎంపిక చేసుకున్న సినిమాల్లోని ప్రధాన పాత్రలకు డబ్బింగ్‌ చెబుతూ, తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది అనసూయ.

‘రంగమ్మత్త’ అదరగొట్టేసిందంతే (Anasuya Bharadwaj)

అనసూయ ఎన్ని బుల్లితెర ప్రోగ్రామ్స్‌ చేసినా ‘జబర్‌దస్త్‌’ ఎలాగైతే ఆమెకు టాప్‌ ఛెయిర్‌ అందించిందో, ఆమె సినిమాలు చేసినా ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమా ఆమెకు అంతటి ప్రాముఖ్యతని అందించిందని నిస్సందేహంగా చెప్పొచ్చు.

‘రంగస్థలం’ సినిమాలో హీరోయిన్‌ సమంత (Samantha Ruth Prabhu) అయినా, అందులో ‘రంగమ్మత్త’ (Rangammatha) పాత్రకి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు. ఆ పాత్రలో అనసూయ ఒదిగిపోయిన తీరు అద్భుతం అంతే. ఏ సినిమాకి ఆ సినిమానే ప్రత్యేకమని చెప్పే అనసూయ, ‘రంగస్థలం’ సినిమాని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేనంటోంది.

వివాదాలా.? లైట్‌ తీస్కో బాసూ.!

‘అర్జున్‌రెడ్డి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఈవెంట్‌లో హీరో విజయ్‌ దేవరకొండ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్ని అనసూయ తప్పుపట్టేసరికి, ఆమెను దారుణంగా ట్రాల్‌ చేశారు. ఆ ట్రాలింగ్‌కి అనసూయ కూడా ఘాటుగానే సమాధానమిచ్చింది.

పవన్‌కళ్యాణ్‌తో (Pawan Kalyan) ఓ సినిమాలో ఛాన్స్‌ విషయమై కూడా అనసూయ ‘ట్రాలింగ్‌’ ఎదుర్కొంది. ఆ మధ్య ఓ పిల్లాడిపై అనసూయ చెయ్యి చేసుకుందంటూ తెరపైకొచ్చిన ఓ వివాదం ఆమెను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. కొన్నాళ్ళపాటు ట్విట్టర్‌కి అనసూయ దూరమవ్వాల్సి వచ్చింది కూడా.

ఎన్ని సమస్యలు ఎదురైనా.. ధైర్యంగా నిలబడటం అనసూయ ప్రత్యేకత. ఆ ధైర్యమే తనను ఈ స్థాయిలో నిలబెట్టిందని చెబుతుంటుంది.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం ఈ విషయంలో తనకు ఎల్లవేళలా అండగా వుంటోందని చెప్పే అనసూయ, తనను అభిమానించే అభిమానులకి ఎప్పటికీ రుణపడి వుంటానని అంటోంది.

అటు బుల్లితెర.. ఇటు వెండితెర.. దేని ప్రత్యేకత అదే అని చెప్పే అనసూయ, సినిమాల్లో నటిగా తానేంటో ప్రూవ్ చేసుకోవడం కోసమే ఎప్పటికప్పుడు డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటుంటానని చెబుతుంటుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group