Table of Contents
Betting Politics.. ఒకాయన రాజకీయమంటే బెట్టింగ్ అనుకుంటున్నాడు. ఫాఫం.. ఆ స్థాయికి దిగజారిపోయాడు.!
‘బాబ్బాబూ, నాకో అసెంబ్లీ సీటు బిచ్చం వెయ్..’ అని ఆయన వాళ్ళ పార్టీ అధినేతను అడుక్కున్నట్టే, అంతా రాజకీయాల్లో అలాగే చేస్తారనే భ్రమల్లో వున్నట్టున్నాడు.!
ఆయనో సినిమా హీరో.! జనానికి ఏదో మంచి చేద్దామని రాజకీయాల్లోకి వచ్చాడు. మార్పు కోసమంటూ ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు.
కానీ, నీతి తప్పిన రాజకీయాలు చేసే సోకాల్డ్ బెట్టింగోడు.. ఒకప్పుడు (అంటే మనిషిగా వున్నప్పుడు) ఆ ‘హీరో’కి అభిమాని అట.
‘హీరో’ అభిమానులంటే సైనికుల్లా వుంటారు.. సినీ నటుడిగా సంపాదించిన సంపాదన నుంచి సేవా కార్యక్రమాల కోసం చేతికి ఎముక లేదన్నట్టుగా ఖర్చు చేసే తమ అభిమాన నటుడికి తగ్గట్టే అభిమానులూ వుంటారు.
కానీ, బెట్టింగులేసుకుని, డబ్బులు సంపాదించి రాజకీయాలు చేసినట్టుండదు ‘హీరో అభిమానుల’ వ్యవహారం.
ఇదీ హీరోయిజం అంటే.!
హీరోయిజం అంటే, తనను అభిమానించేవారిని నాయకుడై నడిపించడం. హీరోని అభిమానించడమంటే, ఆ హీరోని స్ఫూర్తిగా తీసుకుని పది మందికీ సాయపడటం.
ఎన్ని సీట్లలో పోటీ చేయాలన్నదానిపై ఏ పార్టీకి ఆ పార్టీ ఓ ఖచ్చితమైన ఆలోచనతో వుంటుంది. సమయానుకూలం, సందర్భానుసారం వ్యూహాలు మారుతుంటాయి రాజకీయాల్లో.
అంతేగానీ, ఎవడో గొట్టంగాడొచ్చి.. ‘దమ్ముంటే అన్ని సీట్లలోనూ పోటీ చెయ్..’ అనో, ‘కొన్ని సీట్లలోనే పోటీ చెయ్..’ అనో పిచ్చిపట్టినట్టు రెచ్చిపోతే, ఆ తర్వాత అలాంటోళ్ళ మీద పడే స్టాంప్ వేరేలా వుంటుంది.
బెట్టింగోడికీ.. అధినాయకుడికీ అదే తేడా.!
అధినేత మెప్పుకోసం పిచ్చిపట్టినోడిలా మాట్లాడే బెట్టింగోడికీ.. అధినేతకీ చాలా తేడా వుంటుంది. ఎవరి ఫొటోనో పెట్టుకోవాలి బెట్టింగోడికి.
బెట్టింగుల్లో సంపాదించిన సంపాదన కాస్తా, ఓట్లను కొనేందుకు ఖర్చు చేయాలి. గెలిచాక, అంతకు మించి సంపాదించుకునేందుకు అవినీతికి పాల్పడాలి.
కానీ, నిఖార్సయిన ‘జన’ నాయకుడికి.. అధినాయకుడికి ఇంకొకరి ఫొటో పెట్టుకోవాల్సిన అవసరమే వుండదు. కరెన్సీ నోట్లతో ఓట్లను కొనాల్సిన అవసరమే వుండదు. ప్రజల్ని గెలిపించాలనుకున్నోడికి.. తాను ఓడినా ఏమీ ఫరక్ పడదు.
అన్నట్టు, ఆ ‘హీరో’కి అభిమానిగా వున్నప్పుడు.. ఈ బెట్టింగోడు కూడా ఆ హీరో కటౌట్లకే పాలాభిషేకాలు చేశాడుట. అలా చేస్తేనే కదా, నలుగురిలో గుర్తింపు వస్తుంది.
బెట్టింగ్ గ్రామ సింహమది.!
అలా ఆ హీరో పేరుచెప్పుకుని పాపులారిటీ పెంచుకున్నోడికి, తిరిగి ఆ హీరోని విమర్శించే నైతికత వుంటుందా.?
రాజకీయమంటేనే చెంచాగిరీ అనుకునేటోళ్ళ నుంచి నైతికతని ఏం ఆశిస్తాం.? నోరుంది కదా అని నోటికొచ్చినట్టు మొరిగే గ్రామ సింహం గురించి ఏమనుకుంటే మాత్రం ఏం ప్రయోజనం.?
చివరగా.. పదవిలో వున్నప్పుడు అది చేస్తా.. ఇది చేస్తానంటూ ప్రగల్భాలు పలికి.. తీరా, ఆ పదవి పోయాక.. ‘నాకేటి సంబంధం’ అనేటోళ్ళ పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. ఎందుకంటే, ఆ పదవి ఓటర్లు వేసిన ‘బిచ్చం’.!
చివరగా.. ఈ ‘పొలిటికల్ కథ’లో పాత్రలు కల్పితం.!