Bhagavanth Kesari NBK108 నందమూరి బాలకృష్ణ తాజా చిత్రం టైటిల్ ఖరారయ్యింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
‘ఎన్‌బికె108’గా ఇప్పటిదాకా ఈ సినిమాని వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ని చిత్ర యూనిట్ వెల్లడించింది.
Bhagavanth Kesari NBK108.. ‘భగవంత్ కేసరి’గా బాలయ్య..
ఈ సినిమాకి ‘భగవంత్ కేసరి’గా టైటిల్ ఖరారు చేశారు. కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీల ఓ కీలక పాత్రలో కనిపించనుంది.
కాగా, నందమూరి బాలకృష్ణను ఇంతవరకు ఎవరూ చూడని కొత్త కోణంలో తాను ఈ సినిమాలో చూపించనున్నట్లు అనిల్ రావిపూడి వెల్లడించాడు.
అనిల్ రావిపూడి సినిమాలంటే కామెడీకి పెద్ద పీట వేస్తాడు. కానీ, ఈసారి సీరియస్ యాక్షన్ మూవీ చేశాడట అనిల్ రావిపూడి.
గత చిత్రాలతో పోల్చితే టైటిల్ కాస్త భిన్నం..
బాలకృష్ణ సినిమా అనగానే.. ఎలాగోలా అందులో ‘సింహ’ అన్న ప్రస్తావన వస్తుంటుంది. ఈసారి అందుకు భిన్నంగా ‘భగవంత్ కేసరి’ అనే వెరైటీ టైటిల్ పెట్టారు.
ఇంతకీ, ఈ భగవంత్ కేసరి ఏం చేస్తాడు.? ఇంకేం చేస్తాడు.. కత్తి పట్టాడు కదా.! దుష్ట శిక్షణ.. అన్న దిగిండు.. అంటే, అర్థమదే.!