BhagyaShri Borse Tollywood Pulse.. అందం, అభినయం.. అన్నీ వున్నాగానీ, హీరోయిన్‌గా నిలదొక్కుకోవడం కష్టమే.! కానీ, ప్రేక్షకుల పల్స్ పట్టేయగలిగితేనో.!
భాగ్యశ్రీ బోర్సే.! తెలుగు తెరపైకి సరికొత్త గ్లామర్ సంచలనంగా అడుగు పెడుతోంది ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాతో ఈ అందాల భామ.
రవితేజ హీరోగా హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
BhagyaShri Borse Tollywood Pulse.. ప్రమోషన్లలో గ్లామర్ కిక్కు..
‘మిస్టర్ బచ్చన్’ సినిమా ప్రమోషన్లలో భాగ్యశ్రీ బోర్సే చాలా యాక్టివ్‌గా కనిపిస్తోంది. హీరో రవితేజ, ఏ కారణం వల్లనో సినిమా ప్రమోషన్లలో అంత యాక్టివ్‌గా పాల్గొనలేదు.

ఆ లోటుని, భాగ్యశ్రీ బోర్సే తనదైన గ్లామర్‌తో పూడ్చేస్తోంది. సినిమాకి అన్నీ తానే అయి.. అన్నట్లుగా ప్రమోషనల్ ఈవెంట్లలో సందడి చేస్తూ వచ్చింది భాగ్యశ్రీ.
ఆ మధ్య ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో వేదిక మీదనే డాన్స్ చేసి.. ‘ఔరా’ అనిపించింది. మామూలుగా అయితే, కొత్త హీరోయిన్లు మరీ ఇంత అడ్వాంటేజ్ తీసుకోరు.
ట్రెండింగ్ బ్యూటీ..
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో డాన్సులు చేసి, వాళ్ళనీ ఖుషీ చేసింది భాగ్యశ్రీ (Bhagyashri Borse). ఆ వీడియోలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
ఎలా చూసినా, ఈ మధ్యకాలంలో వస్తోన్న చాలామంది కొత్త హీరోయిన్లతో పోల్చితే, భాగ్యశ్రీ బోర్సే, సమ్‌థింగ్ వెరీ స్పెషల్.. అన్నట్లే అనిపిస్తోంది.
Also Read: ప్రభాస్‌తో ఇంకోస్సారి.! కాంబినేషన్ సెట్టైతే ఆ కిక్కే వేరప్పా.!
తొలి తెలుగు సినిమా ‘మిస్టర్ బచ్చన్’ గనుక మంచి హిట్ అయితే, హీరోయిన్‌గా తెలుగునాట భాగ్యశ్రీ బోర్సేకి మంచి రేంజ్ వచ్చేస్తుందన్నది నిర్వివాదాంశం.

భాగ్యశ్రీ, తెలుగు సినిమా ప్రేక్షకుల పల్స్ పట్టేసింది.. అన్న మాట సినీ పరిశ్రమలో ప్రముఖంగా వినిపిస్తోంది. అందుకేనేమో, ఆమెకీ అవకాశాలూ పోటెత్తేస్తున్నాయ్.!
తెలుగు ప్రేక్షకుల పల్స్‌నే కాదు.. టాలీవుడ్ పల్స్ కూడా బాగానే పట్టేసింది అందాల భామ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse).!