Bharat Rashtra Samithi రాష్ట్ర రాజకీయానికీ, జాతీయ రాజకీయానికీ చాలా తేడా వుంది.!
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (Telangana Rashtra Samithi), ఇప్పుడిక జాతీయ రాజకీయం కోసం పేరు మార్చుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) నుంచి తెలంగాణని లేపేసి, ఆ స్థానంలో ‘భారత్’ని తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (Kalvakuntla Chandra Sekhar Rao).
కేసీయార్ అనుసరిస్తున్న వైఖరి.. భారత్ రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల్లో నిలబెడుతుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.
Mudra369
ఖమ్మం వేదికగా, భారత్ రాష్ట్ర సమితి (BRS) ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయిపోయాయి.
ముగ్గురు ముఖ్యమంత్రులు..
మొత్తంగా మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరువుతున్నారు.
వీరిలో, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా వున్నారు. వాస్తవానికి, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఈ మీటింగుకి హాజరు కావాల్సి వుంది.
ఆ మాటకొస్తే, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ గతంలో కేసీయార్ జాతీయ రాజకీయాలకు సంబంధించిన మంతనాలు జరిపిన దరిమిలా, ఆమె కూడా వచ్చి వుండాల్సింది.
స్టాలిన్, మమతా బెనర్జీ వచ్చి వుంటే, బీఆర్ఎస్ జాతీయ రాజకీయానికి బిగినింగ్ అదిరిపోయేది.!
Bharat Rashtra Samithi.. ఆ లెక్కలు వేరే వుంటాయ్..
ముందే చెప్పుకున్నట్లు జాతీయ రాజకీయాలంటే ఆషామాషీ వ్యవహారాలు కాదు. కేసీయార్ గతంలో కేంద్ర మంత్రిగా పనిచేసి వుండొచ్చుగాక. కానీ, ఆ పరిస్థితులు వేరు.
పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌తోనే తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో సఖ్యత కొనసాగించలేకపోతోంది. అలాంటప్పుడు, కేసీయార్.. జాతీయ రాజకీయానికి నాయకత్వమెలా వహించగలరు.?
Also Read: ఎర్రిజీవీ! పాద చూషణం చేసుకోక పవన్‌తో పెట్టుకుంటావేల?
అలాగని, జాతీయ రాజకీయం అంటే అది అసాధ్యమైన వ్యవహారం కాదు.
కాకపోతే, కేసీయార్ అనుసరిస్తున్న వైఖరి.. భారత్ రాష్ట్ర సమితిని జాతీయ రాజకీయాల్లో నిలబెడుతుందా.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.