జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచే దారేదీ.?

 జనసేనాని పవన్ కళ్యాణ్ గెలిచే దారేదీ.?

Janasenani Pawan Kalyan

Janasenani Pawan Kalyan సినిమా రిలీజ్ కోసమే అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి వుంటుంది. మరి, రాజకీయాల సంగతేంటి.?

బీభత్సమైన ప్లానింగ్ వుంటే తప్ప, రాజకీయాల్లో రాణించడం అంత తేలిక కాదు.

2019 ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, 2024 ఎన్నికల్లో ఏం చేయబోతున్నారు.?

ఇప్పుడున్న రాజకీయాల్లో ఓట్ల కోసం డబ్బులు పంచాలి.. అబద్ధాలు చెప్పాలి.. జనాన్ని వీలైనంతగా మోసం చేయాలి..

అవేవీ చేయను, రాజకీయాల్లో మార్పు కోసమే నా పోరాటం.. అంటే, ఇలాంటి మాటలు చెప్పినందుకే 2019 ఎన్నికల్లో రెండు చోట్లా ఓడించారు జనం.

Mudra369

ఆయనేం చేయబోతున్నారు.? అన్న సంగతి పక్కన పెడితే, అసలు ప్రజలు పవన్ కళ్యాణ్‌ని ఎలా చూస్తున్నారన్నది కీలకం.!

Janasenani Pawan Kalyan.. సమస్యలొస్తే వెళుతున్నారుగానీ..

తమకు సమస్యలు వస్తే, వెంటనే జనానికి పవన్ కళ్యాణ్ గుర్తుకొస్తున్నాడు. కానీ, ఎన్నికల్లో మాత్రం ఆయన్ని పట్టించుకోవడంలేదు.

2019 ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ అదే పరిస్థితి. మరి, 2024 ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా వుండబోతున్నాయి.?

Janasenani Pawan Kalyan
Janasenani Pawan Kalyan

ఈ విషయమై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాల పరంగా విఫలమవుతున్నారన్నది మెజార్టీ అభిప్రాయం.

ఎక్కడి నుంచి పోటీ చేయనున్నారు.?

ఎక్కడి నుంచి జనసేన అధినేత పోటీ చేస్తారన్నదానిపై జనసేన శ్రేణులకే స్పష్టత లేదు. గతంలోలా రెండు చోట్ల పోటీ చేస్తే, మళ్ళీ మనుపటి రిజల్ట్ రిపీట్ అయ్యే అవకాశముంది.

వీలైనంత త్వరగా జనసేన అధినేత తాను పోటీ చేయబోయే నియోజకవర్గాన్ని ఖరారు చేసుకుంటే, స్థానికంగా జనసేన నేతలు, కార్యకర్తలు మిగతా వ్యవహారాలు చూసుకుంటారు.

Also Read: Money For Sale.. ఇచ్చట డబ్బులు అమ్మబడును.!

కానీ, ఆ దిశగా పార్టీ శ్రేణులకూ జనసేనాని స్పష్టత ఇవ్వకపోవడం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.

అధికారం సంగతి దేవుడెరుగు.. ముందైతే గెలిచి, చట్ట సభలకు వెళ్ళడం అనేది పవన్ కళ్యాణ్ ముందున్న తక్షణ కర్తవ్యం.! లేకపోతే, రాజకీయంగా మరింత అభాసుపాలవుతారాయన.

Digiqole Ad

Related post