Table of Contents
Bheemla Nayak Box Office Stamina.. కొన్నాళ్ళ క్రితం ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ‘మనల్ని ఎవరు ఆపేది.?’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో చాలామందికి వెన్నులో వణుకు మొదలైంది. పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యక్తి కాదు, ఆయనో శక్తి.!
ఔను, పవన్ కళ్యాణ్ మిగతా హీరోల్లా కాదు. హీరోలకి అభిమానులంటారేమో, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి భక్తులుంటారు. భక్తులు మాత్రమే కాదు, ఆయన మార్గాన్ని అనుసరించే ఫాలోవర్స్ వుంటారు.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై అవాకులు చెవాకులు పేలేవారికి ఆయన వ్యక్తిత్వమేంటో తెలిసినా, తప్పదు.. ట్రోల్ చేయాల్సిందే. అలా చెయ్యకపోతే, వాళ్ళకి తిన్నది అరగదంతే.!
Bheemla Nayak Box Office Stamina పవర్‌ని తట్టుకోవడం సాధ్యమా.?
‘భీమ్లానాయక్’ (Bheemla Nayak) సినిమా విషయానికొద్దాం. ఈ సినిమా ఆగిపోయిందట.. అన్న ప్రచారం మొదటి నుంచీ జరుగుతూనే వుంది. కోవిడ్ పాండమిక్ కారణంగా, సినిమా షూటింగ్ ఇబ్బందుల్లో పడింది. రిలీజ్ విషయంలో తలెత్తిన గందరగోళం సంగతి సరే సరి.
అయినా, అక్కడున్నది పవన్ కళ్యాణ్. సినిమా పూర్తయ్యింది.. సంక్రాంతికి రావాల్సి వున్నా, కొన్ని కారణాలతో సినిమా విడుదల వాయిదా పడింది.. అదీ, పరిశ్రమలో ఆరోగ్యకరమైన వాతావరణం కోసమంటూ, ‘ఆర్ఆర్ఆర్’, ‘రాధేశ్యామ్’ సినిమాల నుంచి వచ్చిన విజ్ఞప్తి కారణంగానే.
దాంతో, ఫిబ్రవరి 25వ తేదీన విడుదల కావాల్సిన ‘భీమ్లానాయక్’ సినిమాని రాజకీయ వివాదాలూ చుట్టుముట్టాయి. కేవలం ‘భీమ్లానాయక్’ మీద కక్షతో కొన్ని రాజకీయ శక్తులు అడ్డమైన కుట్రలూ పన్నుతున్నాయ్.

అయినాగానీ, ‘డోన్ట్ కేర్’ అన్న చందాన ‘భీమ్లానాయక్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. దటీజ్ పవన్ కళ్యాణ్.. అనలాలేమో.!
బాధ్యత తమదేనంటున్న అభిమానగణం.!
‘మీరు సినిమా విడుదల చెయ్యండి.. మిగతా మేం చూసుకుంటాం..’ అంటూ అభిమానులు భరోసా ఇవ్వడం కంటే నిర్మాతలకు ఇంకేం కావాలి.? ‘పవన్ కళ్యాణ్ స్టామినా ఎంత.?’ అని ప్రశ్నించేవాళ్ళకి సరైన సమాధానం ‘భీమ్లానాయక్’తో చెప్పేందుకు అభిమానులూ సమాయత్తమైపోయారు.
మలయాళ సినిమా ‘అయ్యపనుం కోషియం’కి ‘భీమ్లానాయక్’ తెలుగు రీమేక్. పవన్ కళ్యాణ్ భక్తుడు తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకుడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ఈ చిత్రానికి మాటలు అందించాడు.
రానా దగ్గుబాటి (Rana Daggubati), నిత్యా మీనన్ (Nithya Menen) ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
ది పవర్ స్టామినా.!
ఇంతకీ, ‘భీమ్లానాయక్’ స్టామినా ఎంత.? 100 కోట్ల క్లబ్బులోకి చేరుతుందా.? 150 కోట్ల మార్క్ టచ్ చేస్తుందా.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
Also Read: పరాన్నజీవి ప్రొడక్షన్స్: ఈ చరిత్ర ఏ పైత్యంతో.!
పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం చాలా చాలా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ‘భీమ్లానాయక్’ ఆగమనం కోసం. కొత్తగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాక్సాఫీస్ స్టామినా గురించి మాట్లాడాల్సి వస్తే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.
హిట్టూ, ఫ్లాపు.. అన్న ఈక్వేషన్స్‌తో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ సినిమాలు వసూళ్ళను రాబడుతుంటాయి. వరుస ఫెయిల్యూర్స్ వచ్చినాసరే, సినిమా సినిమాకీ అంచనాలు పెరిగిపోవడమంటే అది పవన్ కళ్యాణ్‌కి (Bheemla Nayak Box Office Stamina) మాత్రమే సాధ్యమైన మ్యాజిక్ అనుకోవాలేమో.!