Bholaa Shankar Milky Beauty.. ఏ పాటైనా సరే.. డాన్స్ చేస్తే మాత్రం చిరంజీవిలానే వుండాలి.! చిరంజీవి అంటే డాన్స్.. డాన్స్ అంటేనే చిరంజీవి.!
తెలుగు సినిమాకి సంబంధించి డాన్స్ విషయంలో చిరంజీవి తప్ప ఇంకెవరు.? అన్న చర్చ ఈనాటిది కాదు.! వయసు మీద పడుతున్నా.. చిరంజీవి డాన్సుల్లో గ్రేస్ తగ్గలేదు.!
మునుపటిలా మెగాస్టార్ చిరంజీవి జోరుగా డాన్సులు చేయకపోవచ్చు. వేగం తగ్గినా కానీ, ఆయన డాన్సుల్లోని అందం ఇంకాస్త పెరిగింది.
Bholaa Shankar Milky Beauty మిల్కీ బ్యూటీ సాంగ్ చూశారా.!
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘భోళా శంకర్’ (Bholaa Shankar) నుంచి మిల్కీ బ్యూటీ.. అంటూ సాగే సాంగ్ తాలూకు లిరికల్ వీడియో విడుదలైంది.
యాజ్ యూజువల్.. మెగాస్టార్ చిరంజీవి, డాన్సుల్లో అదరగొట్టేశారు. ఆ స్టైలు.. ఆ స్టైలింగు.. చిరంజీవి కాకపోతే ఇంకెవరు.? అన్నట్లుగానే వుంది.
మిల్కీ బ్యూటీ తమన్నాతో (Tamannaah Bhatia) చిరంజీవికి ఇది రెండో సినిమా. గతంలో ‘సైరా’ (Syraa Narasimha Reddy) సినిమా చేశారు ఈ ఇద్దరూ.
వేదాలం రీమేక్..
తమిళంలో ఘనవిజయం సాధించిన ‘వేదాలం’ సినిమాని తెలుగులోకి ‘భోళాశంకర్’ పేరుతో దర్శకుడు మెహర్ రమేష్ రీమేక్ చేస్తున్నాడు.
కీర్తి సురేష్ (Keerthy Suresh) ఈ ‘భోళా శంకర్’ (Bholaa Shankar) సినిమాలో చిరంజీవికి (Mega Star Chiranjeevi) సోదరిగా నటిస్తోంది.