Table of Contents
Bhumi Pednekar Backbay Water.. అసలంటూ, మంచి నీళ్ళను కొనుక్కోవాల్సి రావడమే.. అత్యంత బాధాకరమైన విషయం.! కానీ, తప్పడంలేదు.!
మామూలుగా అయితే, మార్కెట్‌లో ‘మినరల్ వాటర్’ 20 లీటర్ల టిన్ 10 రూపాయల నుంచి 30 రూపాయల వరకు ఖర్చు చేస్తే దొరుకుతుంది.
అదే, లీటర్ బాటిల్ కొనుగోలు చేయాలంటే మాత్రం, 10 రూపాయల నుంచి పాతిక రూపాయల వరకు ధర పలుకుతుంటుంది. అదే మ్యాజిక్.
కొన్ని బ్రాండ్ల మంచి నీళ్ళ ఖరీదు లీటర్ 50 రూపాయల నుంచి 100 రూపాయలకు వరకు పలుకుతుండడాన్ని చూస్తున్నాం. ఆయా సంస్థలు వాటిని ఆ స్థాయిలో విక్రయిస్తుంటాయ్.
Bhumi Pednekar Backbay Water..మంచి నీళ్ళే.. కానీ, అత్యంత ఖరీదైనవి..
తాజాగా, మార్కెట్‌లోకి మరో ‘మంచి నీళ్ళ’ బాటిల్ వస్తోంది. దీని ఖరీదు జస్ట్ 150 రూపాయలు మాత్రమే. లీటర్ అనుకునేరు, అర లీటర్ ధర మాత్రమే ఇది.
750 మిల్లీ లీటర్ల నీళ్ళ బాటిల్ అయితే, 200 రూపాయల వరకు వెచ్చించాల్సిందే. ఇందులో లీటర్ బాటిల్ అయితే ప్రస్తుతానికి లేదు.

వాస్తవానికి, ఇది ప్లాస్టిక్ బాటిల్‌లో లభ్యం కాదు. పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించని రీతిలో, పేపర్ బ్యాగ్‌తో తయారైన బాక్స్‌లో ఈ నీటిని విక్రయిస్తారు.
మూత కూడా ప్లాస్టిక్ కాదు. అది కూడా, సులువుగానే మట్టిలో కలిసిపోతుందట. పూర్తిగా పర్యావరణ హితం తమ బాటిల్.. అని చెబుతోంది సదరు సంస్థ.
సినీ నటి కొత్త యాపారం.!
ఇంతకీ, ఏంటా సంస్థ.? ఎవరిది.? అంటే, సంస్థ పేరేమో ‘బ్యాక్ బే’. ఇది ఎవరిదో తెలుసా.? బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్‌ది. ఆమె తన సోదరి సమీక్షతో కలిసి ఈ సంస్థని నెలకొల్పింది.
బ్యాక్ బే లైఫ్ మంచి నీళ్ళ ప్రత్యేకత ఏంటో తెలుసా.? హిమాలయన్ వాటర్ అట ఇది. స్వచ్ఛమైనది, సహజమైన మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ కలిగినది.. అని చెబుతోంది భూమి పెడ్నేకర్.
అద్గదీ అసలు సంగతి. మంచి నీళ్ళ వ్యాపారంలో కొత్త పోకడ ఇది.! హిమాలయన్ వాటర్.. సహజ సిద్ధమైనది.. పర్యావరణ హితమైన ప్యాకింగ్.. వెరసి, ధర అదుర్స్.. జేబు చిరిగిపోవాల్సిందేన్నమాట.
నీటి యుద్ధాలు జరుగుతాయ్ మరి..
భవిష్యత్తులో నీటి కోసం యుద్ధాలు జరుగుతాయ్.. అని వందల ఏళ్ళ క్రితమే పెద్దలు చెప్పారు. ఇలా మంచి నీరు రోజు రోజుకీ ఖరీదైపోతోంటే, యుద్ధాలెందుకు జరగవ్.? జరుగుతాయ్.!
సినిమా నటి కదా, తన పాపులారిటీ ఇలా క్యాష్ చేసుకోవాలనుకుంటోందన్నమాట భూమి పెడ్నేకర్. అయినా, మరీ ఇంత దారుణమా.?
Also Read: పుస్తెలమ్మినాగానీ.. ఇకపై ‘పులస’ దొరకడం కష్టమే.!
ప్చ్.. ఇలాంటి వ్యాపారాల్ని చాలామంది చేస్తున్నారు.. సో, భూమి పెడ్నేకర్‌ని మాత్రమే ఈ విషయంలో తప్పు పట్టడానికేమీ లేదు.
నచ్చితే, అంత ఖర్చు చేసి నీళ్ళ బాటిల్ కొనుక్కుని తాగొచ్చు.. లేదంటే, నిర్మొహమాటంగా లైట్ తీసుకోవచ్చు. అంతేనా.? అంతే కాకపోతే, ఇంకేమనగలం.?