Bhumi Pednekar Korika.. బాలీవుడ్ బ్యూటీ భూమీ పెడ్నేకర్.. నటకు ప్రాధాన్యమున్న అనేక పాత్రల్లో నటించి మెప్పించింది.!
అంతేనా, వెండితెరపై అందాల ఆరబోత విషయంలో అస్సలేమాత్రం రాజీ పడలేదు.. రాజీపడబోదు కూడా.!
కేవలం నటి మాత్రమే కాదు, ఫెమినిస్టు కూడా అయిన భూమి పెడ్నేకర్.. తనను తాను బోల్డ్ అండ్ బ్యూటిఫుల్‌గా చెప్పుకుంటుంటుంది.
Bhumi Pednekar Korika.. విషయం వున్నప్పుడు చెప్పుకోవాలి కదా.!
సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాలి కదా.? మన దగ్గర విషయం వున్నప్పుడు మనమెందుకు వెనకబడలా.? అని ప్రశ్నిస్తుంటుంది భూమి పెడ్నేకర్.

నటిగా ఈ స్థాయి పాపులారిటీ వస్తుందని తానెప్పుడూ ఊహించలేదనీ, అయితే కష్టపడితే మంచి ఫలితం వస్తుందని నమ్మేదాన్నని భూమి పెడ్నేకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.
అప్పుడే.. పదహారేళ్ళ వయసులోనే..
భూమి పెడ్నేకర్‌కి పదహారేళ్ళ వయసులోనే ఓ కోరిక వుండేదట. లిప్‌స్టిక్ వేసుకునేటప్పుడు, తన పేరు మీద ఓ బ్రాండ్ వుండాలని అనుకునేదట భూమి.

ఇప్పుడు.. ఇన్నాళ్ళకు ఆ కోరిక నెరవేర్చుకుంది భూమి పెడ్నేకర్ (Bhumi Pednekar). ఆ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్ళడించింది.
సక్సెస్‌ఫుల్ నటి.. అనిపించుకున్న భూమి, ఇప్పుడు సక్సెస్‌ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అనిపించుకోవాలనుకుంటోందట. అద్గదీ అసలు సంగతి.
Also Read: Salaar Teaser Prabhas.. ‘సలార్’.. కంటెంటున్నోడి కటౌటు.!
పూర్తిగా స్థానికత్వాన్ని ప్రోత్సహించేలా, మహిళలు అలాగే, ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందినవారు, ఎయిడ్స్ బాధితులకు సంబంధించిన సేవా కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయబోతున్నారట ఈ ఉత్పత్తుల అమ్మకం ద్వారా.