పునర్నవి భూపాలంలో (Punarnavi Iraga Iraga) ఇంత మంచి డాన్సర్ వుందా.? చాలామంది షాక్ అయ్యారు ఆమె బిగ్ హౌస్‌లో చేసిన డాన్స్ చూస్తే. నిజానికి, బిగ్‌బాస్‌లోకి ఎంటర్ అవుతూనే పస్ట్ డే ఈవెంట్‌లో పునర్నవి (Punarnavi Bhupalam Iraga) చేసిన డాన్స్ పెర్ఫామెన్స్ అదరహో అనాల్సిందే.
అదేదో ప్లాన్డ్ వ్యవహారం.. అనుకునేవాళ్ళకి పునర్నవి (Punarnavi Bhupalam) నిజంగానే పెద్ద షాక్ ఇచ్చింది తాజా ఎపిసోడ్‌లో. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలోని ‘ఇరగ.. ఇరగ..’ సాంగ్‌కి పునర్నవి ఇరగదీసేసేలా డాన్స్ చేసింది.
బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లో భాగంగా బాబా భాస్కర్ (Baba Bhaskar), శ్రీముఖి (Sree Mukhi) జడ్జిలుగా వ్యవహరిస్తే, తొలి పెర్ఫామెన్స్ కంటెస్టెంట్స్ తరఫున పునర్నవి భూపాలం స్టేజ్ మీదకు ఎంట్రీ ఇచ్చింది. పునర్నవి డాన్స్‌కి జడ్జి శ్రీముఖి ఫిదా అయిపోతే, బాబా భాస్కర్ మాత్రం ఆమె డాన్స్‌ని మెచ్చుకుంటూనే కొన్ని వంకలు పెట్టడం గమనార్హం.
స్వతహాగా కొరియోగ్రాఫర్ అయిన బాబా భాస్కర్, కొంచెం ఫన్‌తో కూడిన జడ్జిమెంట్ ఇచ్చాడు. డాన్స్ చేస్తున్నప్పుడు పాట పాడుతున్నట్లు లిప్స్ కూడా హమ్ చేయాలి కదా.? అన్నది బాబా భాస్కర్ వెర్షన్. ఇప్పటిదాకా బిగ్ హౌస్‌లో (Punarnavi Bhupalam Iraga) హాటెస్ట్ ఎపిసోడ్ అంటే ఇదే. ఇక, బిగ్ హౌస్‌లో కంటెస్టెంట్స్ బలాబలాల గురించి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడున్నవారిలో ఎవరూ తక్కువ కాదు.
ఎవరి వ్యూహాలు వారికి వున్నాయి. టాప్ 5లో ఎవరు నిలుస్తారు.? అన్న ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. ఖచ్చితంగా అందులో పునర్నవి వుంటుందన్నది మెజార్టీ అభిప్రాయం.